Home /News /technology /

INSTAGRAM IF YOU ARE AN INSTAGRAM USER THEN BE AWARE OF THESE FEATURES EVK

Instagram: మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్లా.. అయితే ఈ ఫీచ‌ర్స్ గురించి తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Instagram Features | ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. దీని ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్ మరింత సౌకర్యంగా  ఆకర్షనీయంగా మారుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్లు  ఏంటో తెలుసుకోండి.  

    ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. దీని ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్ మరింత సౌకర్యంగా  ఆకర్షనీయంగా మారుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్లు  ఏంటో తెలుసుకోండి.  ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ యూజర్ల కోసం క్విక్ షేర్ (Quick Share) ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు ఏదైనా ఫొటో, వీడియో లేదా రీల్స్‌ను తాము ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్‌కి నేరుగా షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కింద ఉన్న సెండ్ కీలో ఈ ఫీచర్‌ను కనుగొనవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ సెలెక్టెడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

    Google Account: మీ గూగుల్ ఎకౌంట్ సేఫ్‌గా ఉందా.. అనుమానం ఉంటే ఇలా చెక్ చేసుకోండి!


    ఈ అప్‌డేట్‌కు ముందు యూజర్లు డైరెక్టర్ మెసేజ్ (DM)లను షో చేసే లాంగ్ లిస్ట్ ద్వారా ఇతర యూజర్లకు పోస్ట్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బాగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్‌లతో నేరుగా షేర్ చేయడం వీలవుతుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ సెలెక్టెడ్ యూజర్లతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

    యువర్ యాక్టివిటీ ..

    ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఎంత సమయం గడుపుతున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా పరిచయం చేసిన యువర్ యాక్టివిటీ (Your Activity) ఫీచర్లో మార్పు లు చేసిం ది. గతం లో ఉన్న 10 నిమిషాలు, 15 నిమిషాల టైమ్ లిమిట్ స్థానం లో కొత్తగా 30 నిమిషాలను పరిచయం చేసింది. దీంతో ఇన్‌స్టా యూజర్ గడిపే కనీస కాల పరిమితి (Minimum Time Limit) 30 నిమిషాలుగా మారింది. తర్వా త టైమ్ లిమిట్స్ వరుసగా 45 నిమిషాలు, గంట, రెండు గంటలు, మూడు గంటలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంది. పాప్-అప్ మెసేజ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురించి యూజర్లకు తెలియజేస్తుం ది.

    WhatsApp: వాట్స‌ప్ వాడుతున్నారా.. త్వ‌ర‌లో మీకు ఉప‌యోగ‌ప‌డేలా కొత్త‌ ఫీచ‌ర్స్ రాబోతుంది


    లింక్ స్టిక్కర్స్’..

    ఇన్‌స్టాగ్రామ్‌ లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు.. సింపుల్ స్వైప్ (Simple Swipe) అప్ ఫీచర్ ఉపయోగించి లింకులు, కంటెంట్ షేర్ (Content Share) చేయడంతో పాటు కంటెంట్ సేల్, ప్రమోషన్స్ చేసేవారు. ఈ క్రమంలో పరిచయం చేసిన ‘లింక్ స్టిక్కర్స్’(Link Stiker) ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ (Instagram Story)లలో లింక్‌లను షేర్ చేయడానికి మరో మార్గంగా నిలుస్తోంది. గత నెలలో తమ ప్లాట్‌ఫాంలోని ప్రతి ఒక్కరి కోసం ఇన్‌స్టాగ్రామ్ లింక్ స్టిక్కర్స్ ఫీచర్‌ను ప్రారంభించింది. అయితే ఈ లింకులను షేర్ చేయడానికి మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కానవసరం లేదు. అంటే మీకు 10,000 మంది ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Instagram, Latest Technology, Smart phones

    తదుపరి వార్తలు