హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. క్రియేటర్‌కు తెలియకుండానే స్టోరీని లైక్ చేసే సదుపాయం

Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. క్రియేటర్‌కు తెలియకుండానే స్టోరీని లైక్ చేసే సదుపాయం

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందమైన ఫొటోలతో పాటు అద్భుతమైన వీడియోలు, స్టోరీలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ఈ మాధ్యమాన్ని నెటిజన్లు విరివిగా వాడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది.

ఇంకా చదవండి ...

  ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్(Instagram) తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. అందమైన ఫొటోలతో పాటు అద్భుతమైన వీడియోలు, స్టోరీలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ఈ మాధ్యమాన్ని నెటిజన్లు విరివిగా వాడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మెటా అధీన సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తుంది. తాజాగా సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. అదే "ప్రైవేట్ స్టోరీ లైక్స్"(Private Story likes). అంటే మీరు ఇన్‌స్టాలో ఏదైనా స్టోరీని లైక్ చేస్తే అది క్రియేటర్​కు డైరెక్టుగా మెసేజ్ పంపకుండానే లైక్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ యాక్టివేట్ అయిన తర్వాత యూజర్లు స్టోరీలకు(Insta Stories) రియాక్ట్ అవ్వొచ్చు, కానీ ఆ రియాక్షన్లు క్రియేటర్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో కనిపించవచ్చు.

  ఇన్‌స్టా హెడ్ ఆడం ముస్సోరి ఈ ఫీచర్ గురించి తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. "ఈ సరికొత్త ప్రైవేట్ స్టోరీ లైక్స్ ఫీచర్ (Story likes feature) ద్వారా వ్యూయర్ షీట్‌లో డైరెక్ట్ మెసేజ్(DM)లు క్రియేటర్‌కు కనిపించవు. యూజర్లు మాత్రం రియాక్ట్ అవ్వొచ్చు. మెసేజింగ్ అనేది చాలా కీలకమైన ప్రాధాన్యత. కావున మీకు, మీకిష్టమైన వారి మధ్య జరిగే సంభాషణలపై దృష్టి పెట్టి ఈ ఫీచర్‌ (Feature)ను తీసుకొచ్చాం" అని ఆయన అన్నారు.

  టిక్​టాక్​ తరహా ఫీచర్లు..

  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల కంటే కూడా స్టోరీలకు ఎక్కువ మంది తరచూ ప్రతిస్పందిస్తుంటారు.ఫలితంగా మెసేజ్ ఇన్‌బాక్స్ఆ ప్రతిస్పందనలతో నిండిపోతుంది. ఈ కొత్త ఫీచర్ (new feature) ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లవుతుంది. అదనంగా స్టోరీ లైక్ కౌంట్‌ను మాత్రమే క్రియేటర్లు వ్యూయర్ షీట్ ద్వారా వీక్షించవచ్చు. స్టోరీని చూసిన యూజర్ల కౌంట్ లిస్ట్,స్టోరీలకు వచ్చిన లైక్స్ (Likes) ప్రైవేటుగా చూసుకోవచ్చు.

  అయితే, స్టోరీ లైక్స్ (Story likes)​కు కౌంట్ ఉండదు. బదులుగా వ్యూయర్ షీట్‌ (Viewer sheet)లో పీపుల్స్ హ్యాండిల్స్ పక్కన 'హార్ట్ (Heart)' సింబల్‌లో చూపుతుంది. తాజాగా లాంచ్ చేసిన ఫ్రైవేట్ స్టోరీ లైక్స్ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రాలేదు. భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంక ఈ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. అయితే మెటా ప్రాధాన్యతలో భారత్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్నందున త్వరలోనే ఈ ఫీచర్ అప్డేట్ అయ్యే అవకాశముంది.

  షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్ టాక్ నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఆ స్థానాన్ని భర్తీ చేసింది. వీడియో కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి చాలా మందికి బెస్ట్ ఆప్షన్‌గా మారింది. కంటెంట్‌ను ఫొటో షేరింగ్, స్టోరీలు, రీల్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్ అందిస్తుంది. టిక్ టాక్ తర్వాత ఆ స్థాయిలో దూసుకెళ్తున్న ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ల కోసం ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ కూడా వీడియో వేదికలపై దూసుకుపోతూ గట్టి పోటీనిస్తోంది.

  First published:

  Tags: Instagram, Latest Technology, New feature

  ఉత్తమ కథలు