హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Cross Messaging: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు

Cross Messaging: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు

Cross Messaging: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు

Cross Messaging: ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు

Cross Messaging | మీరు ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్నారా? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీరు ఒక యాప్ నుంచి మరో యాప్‌లోకి ఈజీగా మెసేజ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి భారతదేశంలోని కస్టమర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌(DM)లను మెస్సెంజర్ యాప్‌లో విలీనం చేస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్‌ నుంచి బయటకు రాకుండానే ఫేస్‌బుక్ మెస్సెంజర్‌లోని కాంటాక్ట్‌లకు మెస్సేజ్‌లు పంపించవచ్చు. మెస్సెంజర్ నుంచి కూడా ఇన్‌స్టా యూజర్లకు మెస్సేజ్‌లు పంపవచ్చు. ఈ అప్‌డేట్లు Android, iOSలలో పనిచేస్తాయి. క్రాస్-మెసేజింగ్ ఫీచర్ను ఉపయోగించడానికి కస్టమర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెస్సెంజర్ యాప్‌లను అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ (వెర్షన్ 164.0.0.46.123), iOS యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ (వెర్షన్ 165.0) నుంచి యాప్‌లను అప్‌డేట్ చేయాలి.

సగం ధరకే iPhone 12... మీ పాత ఫోన్ ఇచ్చి కొనండి ఇలా

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

మరిన్ని ఫీచర్లు ఉన్నాయి


క్రాస్ మెస్సేజింగ్‌తో పాటు మరిన్ని అప్‌డేట్లను ఫేస్‌బుక్ ప్రకటించింది. డైరెక్ట్ మెస్సేజ్‌లో చాట్‌బాక్స్ రంగును మార్చడం, కొత్త ఎమోజీలు, సెల్ఫీ స్టిక్కర్‌లను సృష్టించడం వంటి మరిన్ని కొత్త ఫీచర్లు అప్‌డేట్లతో పాటు రానున్నాయి. వినియోగదారులు ప్రొఫైల్‌ను సింక్ చేసే ఆప్షన్‌ను ఎంచుకుంటే... ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిస్‌ప్లే పిక్చర్‌, పేరును మెస్సెంజర్ తీసుకుంటుంది. కానీ రెండు ప్లాట్‌ఫాంలలో వినియోగదారుల యూజర్‌నేమ్ ఒకేలా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెస్సెంజర్‌లో చాట్ చేయడానికి యూజర్లు కాంటాక్ట్‌లను సెర్చ్ చేయాలి. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రాంప్ట్ ఈ సేవలను ఎలా పొందవచ్చో చూపిస్తుంది. సంబంధిత కాంటాక్ట్ మెస్సెంజర్ నుంచి ఉందా, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికీ డీఎమ్‌ల కోసం ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో మెస్సెంజర్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌పై స్పష్టమైన సమాచారం లేదు. ఈ అప్‌డేట్ పాత కాంటాక్ట్ చాట్ లిస్ట్‌ను సింక్ చేయదు.

Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

సరికొత్త మెస్సేజింగ్ ఎక్స్‌పీరియన్స్


వినియోగదారులు క్రాస్-మెసేజింగ్ ఫీచర్‌ను ఎంచుకుంటే, ఇన్‌స్టాగ్రామ్ అప్పర్ రైట్ కార్నర్లో ఉన్న DM ఐకాన్ ప్లేస్‌లో మెసెంజర్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ మెర్జింగ్ ఫీచర్‌ అవసరం లేదనుకునే యూజర్లు ఇనీషియల్ సెటప్‌లో 'నాట్ నౌ' ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇన్‌స్టా, మెస్సెంజర్‌ అప్‌డేట్లను ఫేస్‌బుక్ ప్రకటించిన నెల రోజుల తరువాత ఈ సేవలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కస్టమర్ల మెస్సేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి ఇలాంటి కొత్త సేవలను పరిచయం చేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

First published:

Tags: Facebook, Instagram

ఉత్తమ కథలు