INSTAGRAM CAN NO LONGER BE LIKE THAT NEW RULE LAUNCH ON REELS EVK
Instagram: ఇక ఇన్స్టాగ్రామ్ ఇక అలా కుదరదు.. రీల్స్‌లో కొత్త రూల్ లాంచ్!
ప్రతీకాత్మక చిత్రం
Instagram Reels | రీల్స్‌పై ఇన్స్టాగ్రామ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తరువాత ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’కు ఆదరణ పెరిగింది. అయితే కొందరు తమ ఒరిజినల్ కంటెంట్ షేర్ చేస్తుండగా.. మరికొందరు యూజర్లు టిక్‌టాక్ లాంటి ఇతర యాప్స్ లోని వీడియోలను రీసైకిల్ చేసి ‘రీల్స్’కు పోస్ట్ చేస్తున్నారు.
మెటా సంస్థ(Meta Company)కు చెందిన సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram) ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త అప్టేడ్స్ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఫొటో, వీడియో షేరింగ్‌లకు ప్రాధాన్యమున్న ఇన్స్టాగ్రామ్ (Instagram) .. ఈ నేపథ్యంలోనే తాజాగా రీల్స్‌పై సంస్థ దృష్టి పెట్టింది. ముఖ్యంగా టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తరువాత ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’కు ఆదరణ పెరిగింది. అయితే కొందరు తమ ఒరిజినల్ కంటెంట్ షేర్ చేస్తుండగా.. మరికొందరు యూజర్లు టిక్‌టాక్ లాంటి ఇతర యాప్స్ లోని వీడియోలను రీసైకిల్ చేసి ‘రీల్స్’కు పోస్ట్ చేస్తున్నారు.
దీనికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించింది ఇన్స్టాగ్రామ్. ఇక కొత్త ఫీచర్ల విషయానికి వస్తే... ట్యాగ్, ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ కోసం ఇన్‌స్టా తాజాగా ప్రాడక్ట్ ట్యాగ్స్, ఎన్హ్యాన్స్డ్ ట్యాగ్స్, ర్యాంకింగ్ ఫర్ ఒరిజినాలిటీ అనే ఫీచర్లను లాంచ్ చేసింది. . యూజర్లు సులువుగా మెసేజ్‌లు సెండ్ చేసుకోవడానికి వివిధ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలుత కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని.. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందిస్తామని ఇన్స్టాగ్రామ్ తెలిపింది.
ఇతరులు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి.. ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఆయా యూజర్లు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇచ్చే సదుపాయాన్ని ఇన్స్టాగ్రామ్ కల్పిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్లైన్లో ఉన్న స్నేహితులను గుర్తించి.. అందరినీ ఇన్‌బాక్స్‌లోని టాప్‌లోకి చేర్చే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారందరినీ ఒకే చోట చూడవచ్చు. అందుబాటులో ఉన్న వారితో చాట్ చేసుకోవచ్చు.
వినియోగదారులు ఇప్పుడు ఒక పాట 30-సెకన్ల ప్రివ్యూని షేర్ చేసే అవకాశం ఉంది. నేరుగా చాట్ విండో ద్వారా స్నేహితులు ఆ పాటను వినే అవకాశం ఉంది. ఈ ప్రివ్యూ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి Apple Music, Amazon Music, Spotifyతో ఇన్స్టాగ్రామ్ ఒప్పందం చేసుకొంది. కన్వర్జేషన్స్ను పర్సనలైజ్ చేసుకోనే సదుపాయంతోపాటు, కొత్త లో-ఫై చాట్ థీమ్‌ను కూడా ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అందిస్తోంది. ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండానే ఇతరులకు మెసేజ్‌లు పంపవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.