హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Safety Features: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు.. ఇకపై యూజర్లకు మరిన్ని సెక్యూరిటీ ఆప్షన్స్.. వివరాలివే

Instagram Safety Features: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు.. ఇకపై యూజర్లకు మరిన్ని సెక్యూరిటీ ఆప్షన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తాజాగా యూజర్లకు మరిన్ని మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ పరిచయం చేసింది. ఈ అప్‌డేటెడ్ ఫీచర్లతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను చాలా సమర్థవంతంగా బ్లాక్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తాజాగా యూజర్లకు మరిన్ని మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ పరిచయం చేసింది. ఈ అప్‌డేటెడ్ ఫీచర్లతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను చాలా సమర్థవంతంగా బ్లాక్ చేయవచ్చు. అలాగే బ్యాడ్ కామెంట్స్‌ బిల్డర్ చేయవచ్చు. గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ కొత్త సేఫ్టీ టూల్స్‌ల అప్‌డేట్స్ పరిచయం చేశారు. "ఈ రోజు మేం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటర్స్ & యూజర్లు సురక్షితంగా ఉండటానికి న్యూ నడ్జెస్, అప్‌డేటెడ్ బ్లాకింగ్, హిడెన్ వర్డ్స్ ఇంప్రూవ్‌మెంట్స్ అనే కొత్త మార్గాలను ప్రకటిస్తున్నాం" అని ఆడమ్ ఒక ట్వీట్ చేశారు. మరి ఈ కొత్త సేఫ్టీ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి? యూజర్ల సేఫ్టీ ఎంతమేర పెరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం.

నడ్జెస్

కామెంట్స్, డైరెక్ట్ మెసేజ్‌లలో బ్యాడ్ వర్డ్స్ పంపించకుండా ఓన్లీ రెస్పెక్టబుల్ వర్డ్స్ పంపేలా యూజర్లను ప్రోత్సహించడమే ఈ నడ్జెస్ ఫీచర్ ముఖ్య పని. ఒకవేళ యూజర్లు ఏదైనా బ్యాడ్ కామెంట్ చేయాలనుకున్నా లేదా అసభ్యకర మెసేజ్‌ పంపాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్ వెంటనే వారిని నడ్జ్ చేస్తుంది. "హెల్ప్ కీప్ ఇన్‌స్టాగ్రామ్ ఏ సపోర్టివ్ ప్లేస్" అనే పాప్-అప్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల మధ్య గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. నడ్జెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాధించే కామెంట్స్‌కి చాలావరకు కళ్లెం వేస్తాయి. ఒక పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇడియట్, స్టుపిడ్ వంటి అనుచిత పదాలు ఉంటే.. మరొకరు అక్కడ మరింత బ్యాడ్ వర్డ్స్ యూజ్‌ చేయకుండా ఒక రిమైండర్‌ను ఈ ఫీచర్ పంపిస్తుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్‌ లాంగ్వేజ్ లో యాప్స్ వాడే యూజర్లకు ఈ నడ్జెస్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

బ్లాకింగ్

https://twitter.com/instagram/status/1583146516964724738?s=20&t=pzwNDfFsN1JQTR2kZw_9lw

యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేస్తే వారు మళ్లీ ఆ యూజర్లను కాంటాక్ట్ అవ్వకుండా ఇన్‌స్టాగ్రామ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. ఈ కొత్త ఫీచర్‌తో, మీరు ఎవరినైనా బ్లాక్ చేసిన ప్రతిసారీ.. వారి బ్లాక్డ్‌ అకౌంట్‌తో పాటు వారికి సంబంధించిన మిగతా అకౌంట్స్‌ లేదా భవిష్యత్తులో క్రియేట్ చేసే ఇతర అకౌంట్స్‌ బ్లాక్ చేయడం సాధ్యమవుతుంది. ఇది కొత్త అకౌంట్స్ ఉపయోగించి వెంబడించడం/వేధించడం వంటి వాటికి చెక్ పెడుతుంది.

హిడెన్ వర్డ్స్ డిటెక్షన్

https://twitter.com/instagram/status/1583146585810038784?s=20&t=pzwNDfFsN1JQTR2kZw_9lw

హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన మెసేజ్‌లు కామెంట్స్ గుర్తించి వాటిని యూజర్లకు కనిపించకుండా దాచేస్తుంది. ఈ ఫీచర్‌ ఆన్ చేసిన యూజర్లకు కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్ నుంచి హానికరమైన కంటెంట్‌ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు క్రియేటర్ అకౌంట్స్‌కి హిడెన్ వర్డ్స్ డిటెక్షన్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. వారు తమకు కనిపించకూడదు లేదా దాచాలనుకునే ఎక్స్‌ట్రా పదాలు, పదబంధాలు (Phrases), ఎమోజీలు ఒక కస్టమ్ వర్డ్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చూడకూడదనుకున్న కంటెంట్ మొత్తం హైడ్ అవుతుంది.

First published:

Tags: Instagram

ఉత్తమ కథలు