హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అదిరిపోయే కొత్త ఫీచర్ మీ కోసమే..!

Instagram: మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అదిరిపోయే కొత్త ఫీచర్ మీ కోసమే..!

Instagram (ప్రతీకాత్మక చిత్రం)

Instagram (ప్రతీకాత్మక చిత్రం)

సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాటిలో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. ప్రత్యేకమైన ఫీచర్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తమ కస్టమర్ల అభిరుచులకు అనుగునంగా కొత్తకొత్త ఫీచర్స్‌ను అందిస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది ఇన్‌స్టాగ్రామ్.

సోషల్ మీడియా (Social Media)లో పాపులర్ అయిన వాటిలో ఇన్ స్టాగ్రామ్ (Instagram) ఒకటి. ప్రత్యేకమైన ఫీచర్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తమ కస్టమర్ల అభిరుచులకు అనుగునంగా కొత్తకొత్త ఫీచర్స్‌ను అందిస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది ఇన్‌స్టాగ్రామ్.ఇది వ్యక్తులు తమకు ఇష్టమైన పోస్ట్‌లకు లైక్స్​ కొట్టడానికిసదరు వ్యక్తి ఇన్‌బాక్స్‌కు అంతరాయం కలగకుండా అనుమతిస్తుంది.అంతకు ముందు యూజర్లు కేవలం డైరెక్ట్ మెసేజ్‌లను మాత్రమే పంపడానికి అవకాశం ఉండేది. లేకపోతే ఎమోజీలను ఉపయోగించి స్పందించేవారు. ఈ కొత్త ఫీచర్‌పై ఇన్ స్టాగ్రామ్ హెడ్ అడమ్ మోస్సెరీ ట్విట్టర్ (Twitter) వేదిక స్పందించారు.అనవసర డైరెక్ట్ మెసేజ్‌లను క్లీన్​అప్ ​ఫీచర్ ద్వారా తొలగించుకునే అవకాశం ఉంటుందన్నారు. మెటా యాజమాన్యంలోని సోషల్ నెట్‌వర్క్‌కు మెసేజింగ్ టాప్ ప్రయారిటీ అని మోస్సేరి అన్నారు.

యూజర్లు ఎవరికి డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకుంటున్నారో దానిపై మరింత కేర్ తీసుకుంటామని ఆయన తెలిపారు. ఏదైనా పోస్ట్ కింద ఉన్న న్యూ హార్ట్​ ఐకాన్​ను ట్యాప్ చేస్తే.. సదరు పోస్ట్ పంపిన వ్యక్తికి లైక్‌ని పంపొచ్చు. ఎమోజి రియాక్షన్‌లు లేదా మెసేజ్‌ల మాదిరిగా కాకుండా, ఇవి డైరెక్ట్​ మెసేజ్​లో కనిపించవు.అయితే అందుకు బదులుగా వ్యూయర్​ షీట్‌లో కనిపిస్తాయి. స్టోరీస్ వీక్షించే వ్యక్తులు లైక్ కౌంట్‌ను చూడలేరు. అలాగే మరోసారి స్టోరీనీ వీక్షించడం ద్వారా స్టోరీ పంపిన వ్యక్తి వీక్షకుల షీట్‌లో చిన్న హృదయ చిహ్నాన్ని చూడగలుగుతారు. ఇది కథనాన్ని ఇష్టపడిన వినియోగదారులందరినీ చూసేలా చేస్తుంది.

కంటెంట్​ క్రియేటర్లు డబ్బులు సంపాదించే అవకాశం..

అలాగే మరికొన్ని ఫీ‌చర్స్‌ను ఇన్ స్టా‌గ్రామ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ గుర్తించడం,తొలగించడం కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ప్రకారం, ఇకపై ఇన్​స్టాగ్రామ్​ కొత్త అకౌంట్​ ఓపెన్​ చేయాలంటే యూజర్​ తన సెల్ఫీ వీడియో కచ్చితంగా సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్​ను గతేడాది నుంచే పరీక్షిస్తున్నట్లుగా సమాచారం. పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్ రీడర్, స్కానర్, అలాగే నకిలీ పాన్ కార్డ్ ఎలా గుర్తించడం వంటి వాటికోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టాలో 24 గంట‌ల వ‌ర‌కు క‌నిపించే స్టోరీస్‌పై యువత లైక్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : మీరు పోర్న్ చూస్తున్నారా? మిమ్మల్ని వాళ్లు చూస్తున్నారు

దీంతో దాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 15 సెకండ్ల నిడివితో మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియో అప్ లోడ్ చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని 60 సెకండ్ల వ‌ర‌కు పెంచింది. ఇస్టా స్టోరీలో వీడియో 15 సెకండ్లు దాటితే అది ఆటోమేటిక్‌గా వివిధ బాగాలు‌గా విడిపోతుంది. దీంతో చూసేవారికి కొంత ఇబ్బందిగా ఉండేది.

ఓకే వీడియో రెండు మూడు స్టోరీలుగా విడిపోతుంది. దీంతో ప్రస్తుతం స్టోరీ వీడియో నిడివిని 60 సెకన్లకు పెంచారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? అయితే మీరు డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ తొలిసారిగా అమెరికాలో లాంఛ్ అయింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఆ తర్వాత ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందించనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, Latest Technology, Technology

ఉత్తమ కథలు