హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. యాప్ వినియోగాన్ని నియంత్రించే 'Take a Break' ఆప్షన్

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. యాప్ వినియోగాన్ని నియంత్రించే 'Take a Break' ఆప్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఫీచర్‌ను (New Feature) డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు ఇన్‌స్టాగ్రామ్(Instagram) హెడ్ ఆడమ్ మొస్సేరి. ప్రస్తుతం దీన్ని కొంతమంది యూజర్లకు అందించి టెస్ట్ చేస్తున్నట్లు వివరించారు.

మీడియా షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఫేస్‌బుక్ (Meta) యాజమాన్యంలోని ఈ సంస్థ.. యూజర్లు ఎక్కువ సమయం ఫీడ్‌ను స్క్రోలింగ్ చేయకుండా నియంత్రించే ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ‘టేక్ ఎ బ్రేక్’ (Take a Break) పేరుతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత.. కాసేపు బ్రేక్ తీసుకోమని ఈ ఫీచర్ స్క్రీన్‌పై రిమైండర్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు ఇన్‌స్టాగ్రామ్(Instagram) హెడ్ ఆడమ్ మొస్సేరి. ప్రస్తుతం దీన్ని కొంతమంది యూజర్లకు అందించి టెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వారంలోనే ఈ ‘టేక్ ఎ బ్రేక్’ ఫీచర్‌ టెస్టర్లకు అందుబాటులోకి వస్తుందన్నారు. దీన్ని ఎంపిక చేసుకుంటే.. కొంత సమయం పాటు ఇన్‌స్టా యాప్‌ను ఉపయోగించిన తరువాత, కాసేపు విరామం తీసుకోమని యూజర్లకు రిమైండర్ వస్తుంది. ప్రస్తుతం 10, 20, 30 నిమిషాల రిమైండర్ వ్యవధితో ఈ ఫీచర్‌ను ఎంచుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూజర్లు తమ ఇష్ట ప్రకారమే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఫీచర్ పనితీరుపై సలహాలు, సూచనలు సేకరించేందుకు థర్డ్-పార్టీ ఎక్స్‌పర్ట్స్‌తో కలిసి పనిచేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. విరామం తీసుకునేటప్పుడు కొన్ని సూచనలను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తుంది. శ్వాస తీసుకోవడం (deep breaths), మీ ఆలోచనలను రాయడం, ఇష్టమైన పాట వినడం లేదా మీరు చేయాల్సిన పనుల జాబితాపై దృష్టి పెట్టడం.. వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ టూల్స్ ద్వారా యూజర్లకు మెరుగైన ఇన్‌స్టా అనుభవాన్ని అందించనున్నట్లు మొస్సేరి తెలిపారు.

WhatsApp Feature: పొరపాటున వాట్సప్ మెసేజ్ డిలిట్ చేశారా? తిరిగి పొందొచ్చు ఇలా

Jio Cashback Offers: కస్టమర్లకు Jio మరో బంపరాఫర్.. ఈ ప్లాన్లపై భారీగా క్యాష్ బ్యాక్..

స్మార్ట్‌ఫోన్లలో స్పెషల్ ఫీచర్లు

ఇప్పటికే స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అనేక కొత్త ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్నాయి. వివిధ డివైజ్‌లలో ఇలాంటి టూల్స్‌ జోడించాయి. వీటిలో మొత్తం స్క్రీన్-ఆన్ టైమ్‌ను చూపించడం, నిర్దిష్ట సమయం వరకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాని వినియోగాన్ని పరిమితం చేయడం వంటివి ఉన్నాయి. iOSలో ఫోకస్ మోడ్ (Focus mode), వన్‌ప్లస్ డివైజ్‌లలో జెన్ మోడ్ (Zen Mode) వంటి వివిధ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి కొన్ని రకాల యాప్‌ల నోటిఫికేషన్‌లను కొంత సమయం తరువాత నిలిపివేస్తాయి. తద్వారా యూజర్లు అదే పనిగా కొన్ని రకాల యాప్స్‌ను ఉపయోగిస్తూ సమయం వృథా చేయకుండా సాయం చేస్తాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Instagram

ఉత్తమ కథలు