హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో మరో సరికొత్త ఫీచర్.. వారికి మరింత ప్రయోజనం..

Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో మరో సరికొత్త ఫీచర్.. వారికి మరింత ప్రయోజనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Instagram: ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన ఈ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం, యాప్‌లోని లైవ్‌స్ట్రీమింగ్ కాల వ్యవధిని నాలుగు గంటల వరకు పొడిగించింది.

ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన ఈ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం, యాప్‌లోని లైవ్‌స్ట్రీమింగ్ కాల వ్యవధిని నాలుగు గంటల వరకు పొడిగించింది. గతంలో లైవ్‌స్ట్రీమ్‌ డ్యూరేషన్ 60 నిమిషాలుగా ఉండేది. ఈ సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. యోగా టీచర్లు, మ్యుజీషియన్లు, కళాకారులు, కుక్‌లు వంటి వారికి ఈ సదుపాయం ఉపయోగపడనుందని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. ప్రతీ గంటకు వారి లైవ్ స్ట్రీమ్ కు అంతరాయం కలగకుండా, ప్రేక్షకులతో ఎక్కువ సేపు సెషన్లు నిర్వహించుకోవడానికి ఇప్పుడు వీలు ఉంటుంది. గతంలో ఐపీ, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడని కంటెంట్ క్రియేటర్లకు, యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.

లైవ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు లైవ్ స్ట్రీమింగ్ సెషన్లను 30 రోజుల వరకు archiving చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. "ఇప్పుడు లైవ్ వీడియోలు మీ archive లిస్ట్‌లో ఉంటాయి. మీరు మాత్రమే వాటిని చూడగలరు. లైవ్ వీడియోలు ముగిసిన తర్వాత అవి archiveలో 30 రోజుల వరకు అందుబాటులో ఉంటాయి. లైవ్ వీడియోలను మీ ఫోన్‌, ఇతర డివైజ్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. archive నుంచి వాటిని IGTVకి అప్‌లోడ్ చేయవచ్చు" అని ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇతర మార్పులు కూడా...

IGTV, లైవ్ స్ట్రీమ్ ఆప్షన్లలో ఉండే "లైవ్ నౌ" సెక్షన్‌కు మార్పులు చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. యూజర్లు ఆసక్తి చూపించే కంటెంట్‌ను వారికి అందించే ఆలోచనతో ఈ మార్పులు చేస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. యాప్‌లో కస్టమర్లు ఫాలో అయ్యే క్రియేటర్లు, ఫాలో అవ్వని క్రియేటర్ల కంటెంట్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయడానికి ఈ మార్పులు ఉపయోగపడనున్నాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Instagram, News updates, Social Media

ఉత్తమ కథలు