ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇన్‌స్టా రీల్స్‌లో (Insta Reels) కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది మెటా ప్లాట్‌ఫామ్. యూజర్లు ఇన్‌స్టా రీల్స్‌లోనే ఫండ్‌రైజింగ్ (Fundraising) చేయొచ్చు. ఎవరైనా ఫండ్‌రైజింగ్ చేస్తుంటే యూజర్లు డొనేట్ చేయొచ్చు. ఎర్త్ డే సందర్భంగా మెటా ప్లాట్‌ఫామ్ ఈ ఫీచర్ ప్రకటించింది. దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో కస్టమ్ స్టిక్కర్స్, ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ ఫ్రేమ్స్ లాంటి ఫీచర్స్‌ని ప్రకటించింది. ఇన్‌స్టా రీల్స్‌లో ఫండ్‌రైజింగ్ ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 1.5 మిలియన్ల కంటే ఎక్కువ లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
ఇప్పటికే హై ప్రొఫైల్ యూర్స్ అయిన డేవ్ బర్డ్, మ్యాగీ బెయిర్డ్, జ్యాహ్నా బ్రియాంట్ లంటివారు ఫండ్‌రైజింగ్ ఫీచర్ ఉపయోగించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిధులు సేకరించారు. అయితే మెటా వ్యక్తిగతంగా నిధుల సేకరించేవారి నుంచి లావాదేవీలపై రుసుము తీసుకుంటుంది. స్వచ్ఛంద సంస్థలకు విరాళాల కోసం లావాదేవీల ప్రాసెసింగ్ రుసుములను ఇది కవర్ చేస్తుంది. కాబట్టి వారు మొత్తం నిధుల్ని పొందే అవకాశం ఉంటుంది.
Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్... మే 11 నుంచి ఈ సర్వీస్ ఉండదు
2020లో లైవ్ స్ట్రీమ్ ద్వారా నిధుల్ని సేకరించే అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం వ్యక్తిగతంగా నిధుల్ని సమీకరించే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్ క్రియేషన్ బటన్ నుంచి నేరుగా నిధుల సమీకరణను ప్రారంభించే అవకాశం కల్పించింది. లాభాపేక్షలేని సంస్థల కోసం నిధుల్ని సమీకరించేందుకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. ఈ బటన్ క్లిక్ చేస్తే కేవలం లైవ్ స్ట్రీమ్ మాత్రమే కాకుండా ఫండ్‌రైజర్ ఆప్షన్ యాడ్ చేసే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
ప్రస్తుతం రీల్స్‌లో ఫండ్‌రైజింగ్ ఫీచర్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ ఎర్లీ యాక్సెస్ లభించడం విశేషం. ఆన్‌లైన్ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మంచి కారణాల కోసం డబ్బు సేకరించడానికి, యూజర్ల అభిమానం పొందడానికి ఉపయోగించే ఫీచర్ ఇది. దీని వల్ల మెటాకు కూడా బెనిఫిట్స్ లభిస్తాయి. ఫండ్‌రైజింగ్‌లో అనుభవం ఉన్నవారు మళ్లీ మళ్లీ ఈ ఫీచర్ ప్రయత్నించే అవకాశం ఉంది.
Oppo F21 Pro 4G: రేపే ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ సేల్... ఎస్‌బీఐ కార్డుతో డిస్కౌంట్
ఇప్పటి వరకు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇవ్వడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఫండ్ రైజింగ్ ద్వారా 40 లక్షలకు పైగా ప్రజలు 150 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించారని కంపెనీ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల విరాళాలు 20 డాలర్ల కన్నా తక్కువగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram, Instagram post, Instagram reel