హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

To Address Attrition: ఐటీ కంపెనీలకు ఊహించని సమస్య.. దిద్దుబాటు చర్యలకు ఇన్ఫోసిస్ రంగం సిద్ధం..!

To Address Attrition: ఐటీ కంపెనీలకు ఊహించని సమస్య.. దిద్దుబాటు చర్యలకు ఇన్ఫోసిస్ రంగం సిద్ధం..!

ఐటీ కంపెనీలకు ఊహించని సమస్య.. దిద్దుబాటు చర్యలకు ఇన్ఫోసిస్ రంగం సిద్ధం..!

ఐటీ కంపెనీలకు ఊహించని సమస్య.. దిద్దుబాటు చర్యలకు ఇన్ఫోసిస్ రంగం సిద్ధం..!

ఐటీ కంపెనీలు ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అన్ని కంపెనీలు అట్రిషన్‌ రేటు పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అట్రిషన్(Attrition) రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాలు పెంచుతోంది. నికర నియామకాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఐటీ కంపెనీలు ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అన్ని కంపెనీలు అట్రిషన్‌ రేటు పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అట్రిషన్(Attrition) రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాలు పెంచుతోంది. నికర నియామకాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి సంస్థ నియర్‌ టర్మ్‌ మార్జిన్‌లను ప్రభావితం చేస్తాయి. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ అట్రిషన్‌ రేటు 27.7 శాతంగా ఉంది. ఇది 2022 జూన్‌ త్రైమాసికంలో 28.4 శాతానికి పెరిగింది. అయితే అవసరమైన చర్యలు తీసుకుంటామని, అట్రిషన్ రేటును తగ్గిస్తామని కంపెనీ దీమా వ్యక్తం చేస్తోంది. 2022 జూన్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,35,186గా ఉంది. 2022-23 మొదటి త్రైమాసికంలో 21,171 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నారు. 2022 జూన్ త్రైమాసికంలో అట్రిషన్ గత 12 నెలల ప్రాతిపదికన 28.4 శాతానికి పెరిగింది, ఇది త్రైమాసికం క్రితం 27.7 శాతంగా ఉంది.

* అట్రిషన్ రేటును తగ్గిస్తాం

దీని గురించి ఇన్ఫోసిస్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ మాట్లాడుతూ..‘మేము హైరింగ్, కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్‌ల ద్వారా టాలెంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధి సాధిస్తున్నాం. ఇది తక్షణం నియర్‌ టర్మ్‌ మార్జిన్‌లపై ప్రభావం చూపించనప్పటికీ, ఇది అట్రిషన్ రేటును తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆపరేషన్స్‌లో ఎఫిసియన్సీ పెంచడానికి వివిధ కాస్ట్‌ లెవెర్స్‌ను ఆప్టిమైజ్ చేస్తూనే ఉన్నాం.’ అని చెప్పారు. నగదుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల స్ట్రాంగ్‌ FCF(ఫ్రీ క్యాష్‌ ఫ్లో) నికర లాభం 95.2 శాతానికి, ROE (రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) 31 శాతానికి పెరిగిందని నిలంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జుట్టు రాలిపోతుందా..? ఈ ఆకును ట్రై చేయండీ.. మీరు ఊడమన్నా ఊడదు.. పౌడర్ తయారీకి ఈజీ స్టెప్స్..!


* 21,171ల మంది ఉద్యోగుల నియామకం

ప్రభుదాస్ లిల్లాధర్‌లోని రీసెర్చ్ అసోసియేట్ అదితి పాటిల్ మాట్లాడుతూ..‘బీఐటీ మార్జిన్ 20 శాతం వచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 160 బీపీఎస్‌ తగ్గుదల (Ple: 20.7 శాతం, Cons: 21 శాతం) కనిపించింది. LTM IT సేవల అట్రిషన్ 28.4 శాతానికి పెరిగింది, క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌లో 70 బీపీఎస్‌ తగ్గుదల నమోదైంది. 21,171ల మందిని కొత్తగా రిక్రూట్‌ చేసుకున్నారు. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ నియామకాల్లో 6.7 శాతం పెరుగుదల కనిపించింది. EBIT (ఎర్నింగ్స్‌ బిఫోర్‌ ఇంట్రెస్ట్‌, ట్యాక్స్‌) మార్జిన్ గైడెన్స్ బ్యాండ్ ఆర్థిక సంవత్సరం 2023కి 21-23 శాతం వద్ద ఉంది. మార్జిన్లు లోయర్‌ ఎండ్‌ ఆఫ్‌ గైడెన్స్ సమీపంలో ఉండాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.’ అని వివరించారు.

* ఉద్యోగులను నిలుపుకొనేందుకు చర్యలు

ఇన్ఫోసిస్‌తో పాటు, భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌), హెచ్‌సీఎల్ టెక్, విప్రో సహా ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు కూడా ప్రతిభ ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

2022 జూన్ త్రైమాసికానికి టీసీఎస్‌ గత పన్నెండు నెలల ప్రాతిపదికన 19.7 శాతం అట్రిషన్ రేటును నమోదు చేసింది. ఇది గత ఆరు త్రైమాసికాల్లో కంపెనీ నమోదు చేసిన అత్యధిక అట్రిషన్ రేటు కావడం గమనార్హం. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 17.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2023 మొదటి త్రైమాసికంలో విప్రో అట్రిషన్ రేటు 23.3 శాతంగా ఉంది. క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన తక్కువగా ఉంది. విప్రో ఆర్థిక సంవత్సరం 2022 నాలుగో త్రైమాసికంలో 23.8 శాతం అట్రిషన్ రేటును నమోదు చేసింది.

* మోడరేట్‌గా విప్రో అట్రిషన్‌ రేట్‌

విప్రో CEO, MD థియరీ డెలాపోర్టే మాట్లాడుతూ..‘మా ట్యాలెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫలిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. మేము ఇయర్లీ సైకిల్‌ నుంచి త్రైమాసిక ప్రమోషన్ సైకిల్‌కు మారుతున్నట్లు ప్రకటించాం. త్రైమాసిక ప్రమోషన్‌లు ఈ నెల (జులై) నుంచి అమలులోకి వచ్చాయి. 2022 సెప్టెంబర్‌లో అర్హులైన వారికి జీతాల పెంపుదల కూడా ఉంది. గత మూడు వరుస త్రైమాసికాల నుంచి కంపెనీ అట్రిషన్ మోడరేట్‌గా ఉంది.’ అని తెలిపారు.

First published:

Tags: Infosys, It companies, IT Employees, Software developer

ఉత్తమ కథలు