Infosys: ఇన్ఫోసిస్ సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా?

Infosys CEO Salary | ఇన్ఫోసిస్ సీఈఓ రూ.24.67 కోట్ల జీతం తీసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ వార్షిక వేతనం రూ.16 కోట్లు.

news18-telugu
Updated: May 21, 2019, 10:52 AM IST
Infosys: ఇన్ఫోసిస్ సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా?
Infosys: ఇన్ఫోసిస్ సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా? (File photo)
news18-telugu
Updated: May 21, 2019, 10:52 AM IST
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ జీతం ఏడాదికి ఎంతో తెలుసా? అక్షరాలా 24 కోట్ల 67 లక్షలు. అవును... ఏడాది జీతం రూ.24.67 కోట్లు. అంటే నెలకు రూ.2 కోట్లు అన్నమాట. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయన తీసుకున్న జీతం అది. ఇన్ఫోసిస్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించిన వివరాలివి. సలీల్ పరేఖ్ 2018 జనవరిలో ఇన్ఫోసిస్‌లో చేరారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.6.07 కోట్లు ఫిక్స్‌డ్ సాలరీ కాగా, రూ.10.96 కోట్లు బోనస్, ఇన్సెంటీవ్స్, వేరియబుల్ పే రూపంలో వచ్చాయి. 1,03,604 స్టాక్స్ ద్వారా రూ.7.64 కోట్లు ఆయన ఖాతాలో చేరాయి.

Read this: LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

ఇన్ఫోసిస్ సీఈఓ రూ.24.67 కోట్ల జీతం తీసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ వార్షిక వేతనం రూ.16 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక వేతనం 28 శాతం పెరిగింది. ఇక ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూపీ ప్రవీణ్ రావు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.9.05 కోట్ల వేతనం తీసుకున్నారు. అంతకుముందు ఏడాది ఆయన వేతనం రూ.8.22 కోట్లు. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు స్టాక్ ఇన్సెంటీవ్ ప్లాన్ కింద 5 కోట్ల షేర్స్ కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా సలీల్‌ పరేఖ్‌కు రూ.10 కోట్ల విలువైన షేర్స్, ప్రవీణ్ రావుకు రూ.4 కోట్ల విలువైన షేర్స్ దక్కాయి.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఖాళీలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...