ఇండియాలో 5జీ సేవలు రాకతో మొబైల్ తయారీ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లపై దృష్టిసారిస్తున్నాయి. ప్రధానంగా ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్‌లో 5జీ ఫోన్లను తీసుకొస్తూ కస్టమర్లను ఆకట్టుకోనే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫీనిక్స్ (Infinix) మిడ్ రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ (Infinix Zero Ultra 5G) మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్, USB టైప్-సి, ఇన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వచ్చిన ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంపుల్ రేట్ తో 6.8-అంగుళాల ఫుల్-HD+ కర్వ్డ్ 3D AMOLED డిస్‌ప్లేతో లభించనుంది. స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించనుంది. అంతేకాకుండా దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5G డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది.
WhatsApp Feature: ఇబ్బందుల నుంచి కాపాడే వాట్సాప్ ఫీచర్... ఎలా పని చేస్తుందో తెలుసా?
ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 920 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. RAMను 13GB వరకు పెంచుకోవచ్చు. ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా 5G ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ XOSపై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP టెరిటైరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరాను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 180 వాట్స్ థండర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ ఉంటుంది. కనెక్టివిటీ కోసం హ్యాండ్‌సెట్ 5G, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5, Wi-Fi 6 వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.
Paytm: పేటీఎం సంచలనం... యూపీఐ పేమెంట్స్‌పై రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్‌లో 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెప్యాసిటితో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.29,999కు సొంతం చేసుకోవచ్చు. కాస్టైట్ సిల్వర్, జెనెసిస్ నోయిర్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. డిసెంబర్ 25 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. పరిచయ ఆఫర్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ EMI వంటి సదుపాయం పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Smartphone