స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix), బడ్జెట్ రేంజ్‌లో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ (Infinix Smart 6 HD) పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను 2022 ఆగస్టు 7న భారత్‌లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేద్దాం.
* ఫీచర్లు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో డీటీఎస్ (DTS) సరౌండ్ సౌండ్‌ను అందించే స్పీకర్స్‌ను అమర్చారు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 గంటల పాటు టాక్‌టైమ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 2జీబీ ర్యామ్ ఇన్-బిల్ట్‌గా వచ్చింది. 4జీబీ వరకు ర్యామ్‌ను ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ డ్యుయల్ సిమ్ (నానో) ఆఫ్షన్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)పై ఇది రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90.6 శాతం స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 1500:1 కాంట్రాస్ట్ రేషియో డిస్‌ప్లే, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 99 శాతం sRGB కలర్ గామట్ కవరేజీని అందిస్తుంది. ఈ డివైజ్ క్వాడ్-కోర్ 12nm MediaTek డైమెన్సిటీ A22 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే 2GB LPDDR4X RAMను సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 8MP AI రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాకుండా డ్యుయల్ LED ఫ్లాష్‌తో 5MP కెమెరా కూడా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్‌లో టైమ్ లాప్స్, పోర్ట్రెయిట్ అండ్ వైడ్ సెల్ఫీ మోడ్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇది 32GB వరకు ఇన్- బిల్ట్ స్టోరేజ్‌ను అందిస్తుంది. అయితే, ఈ స్టోరేజ్ సామర్ధ్యాన్ని డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ సామర్థ్యాల పరంగా 4G LTE, WiFi 802.11 a/b/g/n, బ్లూటూత్ v4.2కు ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
* ధర
2జీబీ ర్యామ్- 32జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,799 ప్రారంభ ధరతో భారత్‌లో లాంచ్ చేశారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫోర్స్ బ్లాక్, ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ వంటి మూడు కలర్ వేరియంట్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్ కార్ట్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్స్, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే కూడా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Budget smart phone, Infinix, New mobiles