Infinix Smart 6: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్... రూ.9 వేల​ ధరకే కళ్లు చెదిరే ఫీచర్లు

Infinix Smart 6: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్... రూ.9 వేల​ ధరకే కళ్లు చెదిరే ఫీచర్లు

Infinix Smart 6 | ఇన్ఫీనిక్స్ రూ.10,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 10,000) మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఇన్ఫీనిక్స్ తాజాగా మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను (Budget Smartphone) లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 (Infinix Smart 6) పేరుతో ఇది విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్ 2GB ర్యామ్​ + 32GB స్టోరేజ్​ సింగిల్​ వేరియంట్​లోనే లభిస్తుంది. ఇది $120 (రూ. 9,005) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్​ స్మార్ట్​ 6 మొత్తం నాలుగు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.- హార్ట్ ఆఫ్ ఓషన్, లైట్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రి పర్పుల్ వంటి కలర్​ కండినేషన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత మార్కెట్​లో లాంచింగ్​ డేట్​పై ఇంకా స్పష్టత లేదు. ఇండియాలో ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయితే ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఉన్న రియల్‌మీ సీ21వై (Realme C21Y), పోకో సీ31 (Poco C31), రియల్‌మీ సీ21 (Realme C21) లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Mi 11X Pro 5G: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపే... ఆఫర్ ఇంకొన్ని రోజులే

ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 ప్రత్యేకతలు


ఇన్ఫినిక్స్​ స్మార్ట్ 6 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఇది కేవలం 2GB ర్యామ్​ + 32GB స్టోరేజ్​ వేరియంట్‌లోనే లభిస్తుంది. ఇది 6.67 -అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌ డిస్​ప్లేతో వస్తుంది. దీనిపై భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌లో ఫ్రంట్ కెమెరాను అందించింది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ10W ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్ధతిస్తుంది. ఇన్ఫినిక్స్​ స్మార్ట్​ 6 మొత్తం 31 గంటల టాక్ టైమ్, 678 గంటల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుంది.

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 స్పెసిఫికేషన్స్


ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 స్మార్ట్‌ఫోన్ యూనిసోక్​ SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 32GB ఇన్​బుల్ట్​ స్టోరేజ్​ ఉంటుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో ఈ స్టోరేజ్​ను 512GB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)పై పనిచేస్తుంది. దీని వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్​ను చేర్చింది. ఇది 8MP మెయిన్​ కెమెరా సెన్సార్, 0.08MP సెకండరీ కెమెరాలతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం ముందు భాగంలో ప్రత్యేకంగా 5MP సెన్సార్‌ కెమెరాను అందించింది.

ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ 6 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. మైక్రో యూఎస్​బీ పోర్ట్, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాకింగ్‌ వంటివి అందించింది. వీటికి అదనంగా ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, జీ -సెన్సార్ వంటివి చేర్చింది.
Published by:Santhosh Kumar S
First published: