Home /News /technology /

INFINIX SMART 5A SMARTPHONE AVAILABLE WITH HUGE DISCOUNT ON FLIPKART BIG SAVING DAYS SALE SS

Infinix Smart 5A: ఏడు వేలకే 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Infinix Smart 5A: ఏడు వేలకే 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Infinix Smart 5A: ఏడు వేలకే 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Infinix Smart 5A | రూ.7,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో (Flipkart Big Saving Days Sale) ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌తో పాటు ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ ఫీచర్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో (Flipkart Big Saving Days Sale) స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫీనిక్స్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ లభిస్తున్నాయి. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ (Infinix Smart 5A) తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999. కేవలం 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    రూ.10,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రూ.10,000 లోపు బడ్జెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, రియల్‌మీ సీ11 2021, పోకో సీ31, రియల్‌మీ నార్జో 50ఐ, రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ లాంటి మోడల్స్ ఉన్నాయి.

    Jio New Plan: జియో నుంచి మరో యాన్యువల్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

    ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ + XOS 7.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 256జీబీ స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు.

    ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 8మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్రార్ + డెప్త్ సెన్సార్ ఉన్నాయి. కెమెరాలో ఆటో సీన్ డిటెక్షన్, కస్టమ్ బొకే, ఏఐ హెచ్‌డీఆర్, ఏఐ త్రీడీ బ్యూటీ, పనోరమా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఏఐ హెచ్‌డీఆర్, ఏఐ త్రీడీ బ్యూటీ, వైడ్ సెల్ఫీ, పోర్ట్‌రైట్, ఆటో ఫిల్టర్స్ ఉన్నాయి.

    Samsung Galaxy M52: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్

    ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 121 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 33 గంటల టాక్‌టైమ్, 16 గంటల వెబ్ బ్రౌజింగ్, 13 గంటల గేమింగ్, 35 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది. పవర్ మారథాన్ టెక్నాలజీతో 25 శాతం బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. డ్యూయెల్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ సపోర్ట్ లభిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ వేవ్, క్వెట్జాల్ సియాన్ కలర్స్‌లో కొనొచ్చు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, మైక్రో యూఎస్‌బీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Infinix, Mobile News, Mobiles, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు