• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • INFINIX SMART 4 PLUS SALE BEGINS TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Infinix Smart 4 Plus: కాసేపట్లో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ సేల్... ధర రూ.7,999 మాత్రమే

Infinix Smart 4 Plus: కాసేపట్లో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ సేల్... ధర రూ.7,999 మాత్రమే

Infinix Smart 4 Plus: కాసేపట్లో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ సేల్... ధర రూ.7,999 మాత్రమే

Infinix Smart 4 Plus | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.8,000 లోపేనా? ఈ బడ్జెట్‌లో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ ప్రారంభం కానుంది. స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సేల్ జూలై 28న అంటే ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. గతేడాది రిలీజ్ అయిన ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 3 ప్లస్ అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కేవలం 3జీబీ+32జీబీ వేరియంట్ మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.7,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


    ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్పెసిఫికేషన్స్

    డిస్‌ప్లే: 6.82 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 3జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ25
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ వేవ్, వయొలెట్
    ధర: రూ.7,999
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు