Home /News /technology /

INFINIX NOTE 12 TURBO AND INFINIX NOTE 12 LAUNCHED IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS

Infinix Note 12: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్... ఫీచర్స్ ఇవే

Infinix Note 12: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్... ఫీచర్స్ ఇవే
(image: Infinix India)

Infinix Note 12: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్... ఫీచర్స్ ఇవే (image: Infinix India)

Infinix Note 12 | ఇన్ఫీనిక్స్ మొబైల్స్ నోట్ 12 సిరీస్‌లో మరో రెండు మోడల్స్‌ని లాంఛ్ చేసింది. ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో (Infinix Note 12 Turbo), ఇన్ఫీనిక్స్ నోట్ 12 మోడల్స్‌ని పరిచయం చేసింది.

ఇన్ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో మరో రెండు మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే ఇన్ఫీనిక్స్ నోట్ 12, ఇన్ఫీనిక్స్ నోట్ 12ఐ మోడల్స్ రిలీజ్ కాగా ఇప్పుడు ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో, ఇన్ఫీనిక్స్ నోట్ 12 మోడల్స్ వచ్చాయి. ఇన్ఫీనిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. మే 28న సేల్ ప్రారంభం అవుతుంది. ఇక ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. మే 27న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ నోట్ 12 మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ స్ట్రేంజ్ ఎడిషన్ కూడా లాంఛ్ అయింది.

ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో


ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చేస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11 ప్రో, పోకో ఎం4 ప్రో 4జీ, రియల్‌మీ నార్జో 50, రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఆండ్రాయిడ్ 12 + XOS 10.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

WhatsApp: వాట్సప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేస్తోంది... ఎలా పనిచేస్తుందంటే

ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ హైపర్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమరా ఉంది.


ఇన్ఫీనిక్స్ నోట్ 12


ఇన్ఫీనిక్స్ నోట్ 12 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చేస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + XOS 10.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇన్ఫీనిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ హైపర్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమరా ఉంది.

Motorola Edge 30: మోటోరోలా ఎడ్జ్ 30 సేల్ ఈరోజే... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్

ఇన్ఫీనిక్స్ నోట్ 12 టర్బో, ఇన్ఫీనిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్లలో డ్యూయెల్ స్పీకర్స్, డీటీఎస్ సపోర్ట్, 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవడానికి ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Infinix, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు