ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ప్రాసెసర్‌తో కొత్త మొబైల్‌ను లాంఛ్ చేసింది ఇన్ఫీనిక్స్. లేటెస్ట్‌గా ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ (Infinix Note 12 Pro 4G) మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ మొబైల్ మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 4జీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ (MediaTek Helio G99) ఉండటం విశేషం. మీడియాటెక్ రూపొందించిన ఈ కొత్త ప్రాసెసర్‌తో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీంతో పాటు అమొలెడ్ డిస్‌ప్లే, 108MP కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ మిగతా మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. సెప్టెంబర్ 1న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రూ.1,500 డిస్కౌంట్ అందిస్తోంది ఇన్ఫీనిక్స్. ఈ ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ద్వారా మరో రూ.500 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌తో ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.1,099 విలువైన Snokor XE 18 TWS ఇయర్‌బడ్స్‌ని కేవలం ఒక్క రూపాయికే సొంతం చేసుకోవచ్చు.
YouTube History: యూట్యూబ్‌లో మీరేం చూశారు? హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండిలా
#GameOn with more power and longer playtime on the Infinix Note 12 Pro!
????MediaTek Helio G99
????6.7” FHD+ AMOLED Display
????33W Fast Charger + 5000mAh Battery
????Upto 8GB RAM & 256GB of Storage
All of it at just ₹14,999*, sale starts 1st Sept on @Flipkart https://t.co/UesxWlfqdO pic.twitter.com/5YZ1fwksJm
— Infinix India (@InfinixIndia) August 26, 2022
ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 2టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Redmi Note 11 SE: రెడ్‌మీ నుంచి కొత్త మొబైల్ వచ్చేసింది... అమొలెడ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 64MP కెమెరా
ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ అల్‌ట్రా క్లియర్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. 33వాట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + XOS 10.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infinix, Smartphone