Home /News /technology /

Infinix Note 11S: 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఎస్​ రిలీజ్

Infinix Note 11S: 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఎస్​ రిలీజ్

Infinix Note 11S: 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఎస్​ రిలీజ్

Infinix Note 11S: 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఎస్​ రిలీజ్

Infinix Note 11S | భారీ కెమెరాతో ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ (Infinix Note 11S) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ మొబైల్‌లో మరిన్ని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్​ వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇన్ఫినిక్స్​ తాజాగా నోట్ 11ఎస్​ (Infinix Note 11S) స్మార్ట్‌ఫోన్​ను థాయ్‌లాండ్‌ మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఇప్పటికే ఇన్ఫినిక్స్​ నోట్ 11 సిరీస్​లో (Infinix Note 11 Series) ఉన్న నోట్​ 11, నోట్​ 11 ప్రో స్మార్ట్​ఫోన్ల జాబితాలో తాజా హ్యాండ్‌సెట్ కూడా చేరనుంది. ఈ స్మార్ట్​ఫోన్​ మీడియాటెక్​ హీలియో G96 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ సరికొత్త ఇన్ఫినిక్స్​ స్మార్ట్‌ఫోన్ మూడు ర్యామ్​, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందో స్పష్టత లేదు.

Lava Agni 5G: మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన లావా మొబైల్స్

ఇన్ఫినిక్స్​ నోట్​ 11S ధర, లభ్యత


ఇన్ఫినిక్స్​ నోట్ 11 ఎస్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్ థాయిలాండ్​లో THB 6,999 (దాదాపు రూ. 15,700) ధర వద్ద లభిస్తుంది. ఇది 4జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్​, 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ కాన్ఫిగరేషన్ల ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ హ్యాండ్‌సెట్ హేజ్ గ్రీన్, మిత్రిల్ గ్రే, సింఫనీ సియాన్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Google Account: జీమెయిల్ యూజర్లకు అలర్ట్... ఇక లాగిన్ చేయాలంటే ఈ రూల్ పాటించాల్సిందే

ఇన్ఫినిక్స్​ నోట్ 11S స్పెసిఫికేషన్స్


డ్యూయల్-సిమ్ (నానో) ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఎస్ ఆండ్రాయిడ్​ 11పై నడుస్తుంది. ఇది 6.95 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్​తో జత చేయబడిన మీడియా టెక్​ హీలియో G96 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50 -మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, రెండు 2- మెగాపిక్సెల్ స్నాపర్‌ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ముందు భాగంలో 16 -మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది.

ఇన్ఫినిక్స్​ నోట్​ 11 సిరీస్ మాన్‌స్టర్ గేమ్ కిట్‌తో వస్తుంది. ఇది డీటీఎస్​ సరౌండ్ సౌండ్‌ గల డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ఫినిక్స్​ నోట్ 11 ఎస్​ కనెక్టివిటీ ఆప్షన్లు పరిశీలిస్తే.. 5జీ, 4జీ ఎల్​టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్​బీ టైప్-సి పోర్ట్, యూఎస్​బీ ఓటీజీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్​ను కలిగి ఉంటుంది. ఇది 33W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone

తదుపరి వార్తలు