ఇన్ఫీనిక్స్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రెండు స్మార్ట్ఫోన్ల ధరల్ని ఇన్ఫీనిక్స్ తగ్గించింది. ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ (Infinix Hot 11s), ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ (Infinix Note 11s) స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో వీటిని కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. గతంలో ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ రూ.15,000 లోపు బడ్జెట్లో ఉండేది. ఇప్పుడు రూ.10,000 లోపే కొనొచ్చు. ఇక ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ రూ.20,000 లోపు బడ్జెట్లో రిలీజైతే ప్రస్తుతం రూ.15,000 లోపే కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.9,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.10,999 ధరకు కొనొచ్చు.
OnePlus 9RT: వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే
Can we #FastForward to the good part? ?⏩
The Infinix HOT 11S is now available at a price drop of ₹1000 exclusively at the @Flipkart curtain raiser!
Buy now: https://t.co/IVJe1JkntI pic.twitter.com/jyOeFXV8nx
— InfinixIndia (@InfinixIndia) January 14, 2022
ఇన్ఫీనిక్స్ హాట్11ఎస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండగా మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఇన్ఫీనిక్స్ XOS 7.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,999 ధరకు రిలీజైన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు కొనొచ్చు.
UPI PIN: యూపీఐ పిన్‌తో మోసాలు... జాగ్రతగా ఉండకపోతే అకౌంట్ ఖాళీ
#OwnTheGame with the ultimate gaming beast- the Infinix NOTE 11S #FreeFire Edition (8GB+128GB). Now, available at an exclusive price of ₹14, 999 only at the @Flipkart #BigSavingDays,
Buy now: https://t.co/oSwSdJmy0T pic.twitter.com/p0FgR9940H
— InfinixIndia (@InfinixIndia) January 13, 2022
ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.95 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఇన్ఫీనిక్స్ XOS10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infinix, Mobile News, Mobiles, Smartphone