Home /News /technology /

INFINIX NOTE 11I SMARTPHONE LAUNCHED WITH MEDIATEK HELIO G85 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Infinix Note 11i: ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ స్మార్ట్​ఫోన్ లాంచ్​... బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన గేమింగ్​ డివైజ్​

Infinix Note 11i: ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ స్మార్ట్​ఫోన్ లాంచ్​... బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన గేమింగ్​ డివైజ్​
(ప్రతీకాత్మక చిత్రం)

Infinix Note 11i: ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ స్మార్ట్​ఫోన్ లాంచ్​... బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన గేమింగ్​ డివైజ్​ (ప్రతీకాత్మక చిత్రం)

Infinix Note 11i | బడ్జెట్​ ధరలోనే గేమింగ్​ స్మార్ట్‌ఫోన్​ ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ (Infinix Note 11i) లాంఛ్ అయింది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్​ నుంచి బడ్జెట్​ ధరలో మరో స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. ఇన్ఫినిక్స్​ నోట్​ సిరీస్​లో నోట్​ 11ఐ (Infinix Note 11i) స్మార్ట్‌ఫోన్​ను సంస్థ లాంచ్​ చేసింది. ఈ కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్​ఫోన్‌లో 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్​ మీడియా టెక్​ హీలియో G85 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 64 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం, ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఐ ఘనాలో GHC 979 (దాదాపు రూ. 11,900) వద్ద విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్​ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​తో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఘనాలో లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​ భారత లాంచింగ్​పై ఎటువంటి స్పష్టత లేదు.

Android Alert: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 7 యాప్స్ డిలిట్ చేయండి

ఇన్ఫినిక్స్​ నోట్​ 11i స్పెసిఫికేషన్లు


ఇన్ఫినిక్స్​ నోట్​ 11i ఆండ్రాయిడ్​ 11 ఆధారిత XOS 7.6పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.95 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఐ మీడియా టెక్​ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

Samsung Galaxy A32: సాంసంగ్ గెలాక్సీ ఏ32 కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2- మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలను అందించింది. ఇక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ పరంగా చూస్తే..16 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చేర్చింది. ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఐ గేమింగ్ డివైజ్‌గా పేరొందింది. ఇన్ఫోనిక్స్​ నోట్​ 11ఐలోని కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. వైఫై 802.11, 5జీ, బ్లూటూత్, జీపీఎస్​, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యూఎస్​బీ పోర్ట్, ఓటీజీ, ఎఫ్​ఎమ్​ రేడియో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ అథెంటికేషన్​ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ప్యాక్ చేస్తుంది. ఇన్ఫినిక్స్​ నోట్​ 11ఐ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Infinix, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు