INFINIX INBOOK X2 PRICE USD 399 LAUNCH SPECIFICATIONS 10 GEN INTEL CORE I3 WINDOWS 11 GH VB
Infinix InBook X2: ఇన్ఫినిక్స్ నుంచి మరో బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్.. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ ఎక్స్ 2 ధర, ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ స్మార్ట్బ్రాండ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనే కాదు ల్యాప్‌టాప్ మార్కెట్లోనూ దూసుకుపోతోంది. గత ఏడాది ఇన్ఫినిక్స్ తన తొలి ల్యాప్‌టాప్.. ఇన్బుక్ ఎక్స్ 1ను లాంచ్ చేసింది. దీనికి మంచి స్పందన రావడంతో సోమవారం ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్2 (Infinix InBook X2) ల్యాపీని ఆవిష్కరించింది.
ప్రముఖ స్మార్ట్బ్రాండ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ (Smart phone) మార్కెట్లోనే కాదు ల్యాప్‌టాప్(Laptop) మార్కెట్లోనూ దూసుకుపోతోంది. గత ఏడాది ఇన్ఫినిక్స్ తన తొలి ల్యాప్‌టాప్.. ఇన్బుక్ ఎక్స్ 1ను లాంచ్ చేసింది. దీనికి మంచి స్పందన రావడంతో సోమవారం ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్2 (Infinix InBook X2) ల్యాపీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్‌తో జతచేసిన 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌పై(Professor) పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 ల్యాప్‌టాప్ 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 50Wh బ్యాటరీని అమర్చింది. దీనిలో అధునాతన DTS సౌండ్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్ సెటప్‌ను అందించింది.
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 ధర, లభ్యత..
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ ఎక్స్2 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇంటెల్ కోర్ i3- పవర్డ్ వేరియంట్ $399 (దాదాపు రూ. 29,700), ఇంటెల్ కోర్ i5 -పవర్డ్ వేరియంట్ $549 (దాదాపు రూ. 40,900), ఇంటెల్ కోర్ i7- పవర్డ్ వేరియంట్ $649 (దాదాపు రూ. 48,300) ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ ఈజిప్ట్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో కొనుగోలు చేయడానికి నెలాఖరులోగా అందుబాటులోకి వస్తుంది. ప్రాంతాన్ని బట్టి ధరలు మారవచ్చని ఇన్ఫినిక్స్ పేర్కొంది. అయితే, భారత్‌లో దీని లాంచింగ్ డేట్‌పై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు.
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 స్పెసిఫికేషన్లు..
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2.. విండోస్ 11 అవుట్-ఆఫ్- ది -బాక్స్‌పై రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 16:9 యాస్పెక్ట్ రేషియోతో 14- అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i3-1005G1 ప్రాసెసర్ లేదా ఇంటెల్ కోర్ i5-1035G1 లేదా ఇంటెల్ కోర్ i7-1065G7 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. డ్యూయల్-బ్యాండ్ వైఫై 802.11 ab/b/g/n/ac, బ్లూటూత్ v5.1, రెండు యూఎస్బీ టైప్- సీ పోర్ట్‌లు, రెండు USB 3.0 పోర్ట్‌లు, ఒక HDMI 4.1 పోర్ట్, ఒక ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 అధునాతన DTS సౌండ్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లతో వస్తుంది. దీనిలో 50Wh బ్యాటరీ సుమారు ఒక రోజుకు సరిపోయే బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.