Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే

Infinix Hot 8 | ఇవే ఫీచర్లతో ఇతర కంపెనీల ఫోన్ కొనాలంటే కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి. కానీ... ఇన్ఫీనిక్స్ మాత్రం కేవలం రూ.6,999 ధరకే ఇన్ఫీనిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

news18-telugu
Updated: September 4, 2019, 4:34 PM IST
Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే
Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే (image: Flipkart)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు కొత్త మోడల్ రిలీజైంది. అద్భుతమైన ఫీచర్లు, అతి తక్కువ ధరతో ఇన్ఫీనిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ధర రూ.6,999 మాత్రమే అయినా ఫీచర్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6.5 అంగుళాల డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ... ఇలా ఈ ఫోన్ ఫీచర్లన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవే ఫీచర్లతో ఇతర కంపెనీల ఫోన్ కొనాలంటే కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి. కానీ... ఇన్ఫీనిక్స్ మాత్రం కేవలం రూ.6,999 ధరకే ఇన్ఫీనిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ధర అక్టోబర్ 30 వరకే ఉంటుంది. ఆ తర్వాత ధర రూ.7,999. సేల్ సెప్టెంబర్ 12న మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది ఈ ఫోన్.





ఇన్ఫీనిక్స్ హాట్ 8 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.52 అంగుళాలు
Loading...
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 13+2
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
కలర్స్: క్వీట్జల్ సియాన్, కాస్మిక్ పర్పుల్, షార్క్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్
ధర: రూ.6,999

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే

5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర ఎంతో తెలుసా?
First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...