Infinix Hot 30i: ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఒక గుడ్‌న్యూస్. తక్కువ ధరలో బడ్జెట్ రేంజ్ డివైజ్‌లను అందించే ఇన్ఫినిక్స్ (Infinix) బ్రాండ్, తాజాగా మరో ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 30i (Infinix Hot 30i) పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10వేల లోపే ఉండటం గమనార్హం. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కస్టమ్ ఓఎస్, మీడియా టెక్ ప్రాసెసర్, ఇతర ఫీచర్లతో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ చూద్దాం.
* స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్‌లో వెనుక వైపు AI లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెన్సార్ క్వాలిటీ పిక్చర్స్ క్యాప్చర్ చేయగలదు. డివైజ్‌లో 5MP ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందించింది. ఈ ఫోన్ 6.6 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్క్రీన్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్.. వంటి ఇతర ఫీచర్లతో ఈ ఎంట్రీ లెవర్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్.. కంపెనీ డెవలప్ చేసిన ఆండ్రాయిడ్ 12 బేస్డ్ XOS 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 8GB RAMకి కనెక్ట్ అయి ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్‌తో దీన్ని 16GB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీంట్లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్స్ స్టాండర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 8.4mm మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.
Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?
* ధర ఎంత?
మన దేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరుగుతాయి. ఏప్రిల్ 3న ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి. డివైజ్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.8,999 మాత్రమే. ఇది గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infinix, Smart phone, Technolgy