Infinix Hot 20S: ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి మరో కొత్త ఫోన్ రిలీజ్ అయింది. బడ్జెట్ రేంజ్లో లాంచ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కంపెనీ మొదట ఇన్ఫినిక్స్ హాట్ 20S(Infinix Hot 20S) పేరిట ఎంట్రీ లెవల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫిలిపిన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ G96 SoC, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి మీడియం రేంజ్ ఫీచర్స్‌తో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్20ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
* ఇన్ఫినిక్స్ హాట్ 20Sస్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల IPS FHD+ డిస్ప్లేతో లభిస్తుంది. గేమింగ్ స్పెసిఫిక్ ఫీచర్స్ కోసం డిస్ప్లే హైపర్ విజన్ గేమింగ్-ప్రోగా పనిచేస్తుంది. ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G96 ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ను MicroSD కార్డ్ సహాయంతో 512జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.
* 50MP+ 2MP+ 2MP
ఇమేజెస్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో పాటు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు రెండు ఉంటాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. Infinix Hot 20S ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. 18W టైప్-సి ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఫిలిపిన్స్‌లో లాంచ్ అయిన Infinix Hot 20S బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
* ఇండియన్ మార్కెట్లోకి కొత్త 5G ఫోన్
మరోపక్క ఇన్ఫినిక్స్ కంపెనీ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లలోకి తీసుకురానుంది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ పేరుతో బడ్జెట్ రేంజ్లో స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 1వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఓ ట్వీట్ చేసింది. గ్లోబల్‌గా ఇప్పటికే లాంచ్ కావడంతో ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్స్ అందరికి తెలిశాయి. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో ఇది భారత్‌లో లాంచ్ కానుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 10.6 ద్వారా పని చేస్తుంది. 50MP+ 2MP రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP కెమెరాను అమర్చారు. 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొబైల్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.15 వేలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 20S ధర
బడ్జెట్ రేంజ్ ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్లో లాంచ్ అయింది. 8GB+128GB వేరియంట్ ధర ఫిలిపిన్స్ కరెన్సీలో PHP 8,499 (సుమారు రూ.12,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇన్ఫినిక్స్ హాట్ 20S స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. వైట్, పర్పుల్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లు ప్రస్తుతం Shopeeలో కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infinix, Technology