Infinix Hot 20 5G : భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన నగరాల్లో దశల వారీగా 5జీ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో మొబైల్ తయారీ కంపెనీలు 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లను బడ్జెట్ రేంజ్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ఇప్పటికే స్వదేశీ బ్రాండ్ లావా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ‘లావా బ్లేజ్ 5G’ పేరుతో బడ్జెట్ రేంజ్లో తీసుకురాగా, తాజాగా ఇన్ఫినిక్స్ కూడా డిసెంబర్ 1న ఇన్ఫినిక్స్ హాట్ 20 5G పేరుతో బడ్జెట్రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను పరిశీలిద్దాం..
Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్
ఈ బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 120Hz హైపర్-విజన్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 6-nm-బేస్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బయోనిక్ బ్రీతింగ్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది ఫోన్ వినియోగిస్తున్న సమయంలో హీట్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ ఫోన్ మల్టీటాస్కింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
డ్యూయల్ LED ఫ్లాష్
ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ LED ఫ్లాష్‌తో 50MP డ్యూయల్ AI కెమెరా ఉంటుంది. AI కెమెరా 18 ప్రీసెట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోన్ ముందు భాగంలో LED ఫ్లాష్‌తో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. Infinix HOT 20 5G స్మార్ట్‌ఫోన్ (4GB +64 GB) సింగిల్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. 4GB RAMను వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా అదనంగా మరో 3GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది USB టైప్-C కేబుల్ ద్వారా 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ట్రూ 5G సపోర్ట్‌తో వస్తుంది. 5G నెట్వర్క్ 12 బ్యాండ్ల వరకు పనిచేస్తుంది.
డిసెంబర్ 9 నుంచి సేల్స్ మొదలు
Infinix Hot 20 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో డిసెంబర్ 1న రూ.11,999తో లాంచ్ అయింది. డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,500కు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎక్స్ఛేంజ్ చేస్తున్న పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Infinix