Infinix Hot 10 Play: గంటల తరబడి చార్జింగ్ కావాలా...రూ.9 వేల లోపే భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్...

Infinix Hot 10 Play: గంటల తరబడి చార్జింగ్ కావాలా...రూ.9 వేల లోపే భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్...

ప్రతీకాత్మకచిత్రం

బడ్జెట్‌ ధరలో మొబైల్‌ వస్తోందంటే మన దేశ మార్కెట్‌లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అందుకే చాలా సంస్థలు ఈ మేరకు ₹10 వేల బడ్జెట్‌ లోపు మంంచి ఫీచర్లతో మొబైల్స్‌ లాంచ్‌ చేస్తూ ఉంటాయి. అలా ట్రాన్సిషన్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఇన్ఫినిక్స్‌ కొత్త మొబైల్‌ను మన మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

  • Share this:
బడ్జెట్‌ ధరలో మొబైల్‌ వస్తోందంటే మన దేశ మార్కెట్‌లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అందుకే చాలా సంస్థలు ఈ మేరకు ₹10 వేల బడ్జెట్‌ లోపు మంంచి ఫీచర్లతో మొబైల్స్‌ లాంచ్‌ చేస్తూ ఉంటాయి. అలా ట్రాన్సిషన్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఇన్ఫినిక్స్‌ కొత్త మొబైల్‌ను మన మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్‌ హాట్‌ 10 ప్లే పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఆకట్టుకునే ఫీచర్‌. దాంతోపాటు ఫర్వాలేదనిపించే ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు. ఇంకా ఈ మొబైల్‌ ప్రత్యేకతలు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

గతేడాది అక్టోబరు వచ్చిన ఇన్ఫినిక్స్‌ హాట్‌ 10కు ఈ మొబైల్‌ సక్సెసర్‌గా హాట్‌ 10 ప్లే వస్తోంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఇస్తున్నారు.4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ ఉంటుంది. 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది టీఎఫ్‌టీ ఐపీఎస్‌ డిస్‌ప్లే. దీని స్క్రీన్‌ టు బాడీ రేషియో 90.66గా ఉంటుంది. ఈ మొబైల్‌ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో మెమొరీ కార్డుతో 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. అందులో ప్రధాన కెమెరా 13 ఎంపీ. ఇది ఎఫ్‌/1.8 అపెచ్యూర్‌తో వస్తుంది. దీంతోపాటు ఓ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లెన్స్‌ కూడా ఉంటుంది. ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు కెమెరా స్లో మోషన్‌ వీడియో, డాక్యుమెంట్‌ మోడ్‌ లాంటి ఫీచర్లకు సపోర్టు చేస్తుందట. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే ఏఐ పోర్‌ట్రైట్‌, త్రీడీ ఫేస్‌ బ్యూటీ మోడ్‌, వైడ్‌ సెల్ఫీ లాంటి ఫీచర్లు ఉంటాయి.

ఎక్కడ.. ఎంత.. ఎప్పుడు...
హాట్‌ 10 ప్లే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర ₹8,499. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌‌లో వీటి సేల్‌ మొదలవుతుంది. మొరాండి గ్రీన్‌, 7 డిగ్రీ పర్పుల్‌, ఏజియన్‌ బ్లూ, అబ్సీడియన్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ మొబైల్‌ లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఈ మొబైల్‌ కొనుగోలు చేసినవారికి ₹4,000 రూపాయల బెన్‌ఫిట్స్‌ అందిస్తున్నట్లు ఇన్ఫినిక్స్‌ తెలిపింది. జియో వినియోగదారులు ₹349లతో రీఛార్జి చేసుకుంటే... ₹50 విలువైన 40 వోచర్లు ఇస్తారు. దీంతోపాటు మరో ₹2,000 విలువైన బ్రాండ్‌ కూపన్లు కూడా ఇస్తారు.
First published:

అగ్ర కథనాలు