ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్(Smartphone) కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఇన్ఫినిక్స్ (Infinix) కంపెనీ. ఇండియాలో కంపెనీ కొత్తగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 (Infinix Smart 6) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 2020 ఆగస్టులో రిలీజ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 (Infinix Smart 5) ఫోన్‌కు ఇది సక్సెసర్. తక్కువ ధరలో లభిస్తున్న ఈ ఫోన్, ఎంట్రీ లెవల్(Entry Level) ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. డ్యుయల్(Dual) రియర్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీ సామర్థ్యం.. దీని ముఖ్య ఫీచర్లు. ఈ ఫోన్ మే 6 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఇది హార్ట్ ఆఫ్ ఓషన్, లైట్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రి పర్పుల్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్(Design) పరంగా చూస్తే.. స్మార్ట్ 6 ఫోన్ కొత్తస్టైల్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.
* ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ధర
Infinix Smart 6 ఫోన్ సింగిల్ 64GB మోడల్‌లోనే లభిస్తుంది. దీని ధర రూ. 7,499గా ఉంది. ఫోన్ సేల్స్ మే 6న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి ఫోన్ సేల్స్ ప్రారంభమైనప్పుడు అలర్ట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కోటక్ క్రెడిట్ కార్డ్, RBL క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ వంటి ఇతర ఆఫర్లతో స్మార్ట్ 6 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లకు 5 శాతం స్పెషల్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
* ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 స్పెసిఫికేషన్లు
తాజా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్ 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో A22 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. డిస్‌ప్లేలో సింగిల్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను డిజైన్ చేశారు. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్, 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. దీని చిప్‌సెట్ 2GB RAM (అదనపు 2GB వర్చువల్ RAM), 32GB స్టేరేజ్‌లో లింక్ అవుతుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఎంట్రీ లెవల్ యూజర్ల కోసం రూపొందించింది. అందువల్ల ఇందులో మోడెస్ట్ హార్డ్‌వేర్‌ను అందించింది. ఇది Android 11 (Go ఎడిషన్) బేస్డ్ XOS 7.6పై రన్ అవుతుంది. ఇందులో గూగుల్ యాప్స్ టోన్-డౌన్ వెర్షన్‌లో వస్తాయి. ఫోన్ ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను యాంటీ బాక్టీరియల్ మెటీరియల్‌తో తయారు చేసినట్లు పేర్కొంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్‌లోని రియర్ కెమెరా మాడ్యూల్ AI సెన్సార్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. రియర్ కెమెరా మాడ్యూల్‌లో డబుల్ LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీని కెమెరాలు యాప్ ఆటో సీన్ డిటెక్షన్, AI HDR, బ్యూటీ, పోర్ట్రెయిట్ వంటి మోడ్స్‌తో రానుంది. స్మార్ట్ 6 ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ స్పెషల్ ఎట్రాక్షన్. ఇది గరిష్టంగా 31 గంటల లైఫ్‌ను అందిస్తుంది. బ్లూటూత్ v5.0, 3.5mm ఆడియో జాక్ వంటి మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Infinix, Mobile phone, New smartphone, Technology