INFINIX BUDGET SMARTPHONE LAUNCH IN INDIA ON APRIL 15 HOT 11 2022 PHONE COMING WITH BEST FEATURES AT A LOW PRICE GH VB
Infinix Smartphone: ఆ రోజే ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో..
ప్రతీకాత్మక చిత్రం
ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 (Infinix Hot 11 2022) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఫోన్ల సేల్ భారత్‌లో ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నాయి. వీటి అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి.
భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు(Smartphone) డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు(Best Feature), మంచి కెమెరా లెన్స్(Camara Lens), ఇతర స్పెసిఫికేషన్లతో(Specifications) కంపెనీలు వీటిని లాంచ్(Launch) చేస్తున్నాయి. ఇప్పటికే షియోమి, రియల్మీ, పోకో(Poco), మోటో, ఇతర కంపెనీలు చౌకైన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేశాయి. తాజాగా ఈ జాబితాలో ఇన్ఫినిక్స్ (Infinix) కంపెనీ చేరింది. ఈ వారంలోనే ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 (Infinix Hot 11 2022) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఫోన్ల సేల్ భారత్‌లో ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నాయి. వీటి అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి.
ఈ డివైజ్ లాంచింగ్‌కు ముందు ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. Infinix Hot 11 2022 స్పెసిఫికేషన్లు భారతదేశ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Infinix Hot 11 2022 ఇండియన్ సబ్-10K మార్కెట్ కిందకు రానుంది. Realme C31, Poco C31, Moto E40, Redmi 9 Activ వంటి వాటితో తాజా ఫోన్ పోటీపడే అవకాశం ఉంది.
Infinix Hot 11 2022 స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ ఈ బడ్జెట్ ఫోన్ గురించి వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని గురించి తాజా అప్డేట్స్ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది. ఈ వివరాలను బట్టి.. Infinix Hot 11 2022 అరోరా గ్రీన్, పోలార్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. హాట్ 11 2022 డివైజ్ 6.7 అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ 550 నిట్స్ బ్రైట్నెస్, 114 శాతం sRGB కలర్ కవరేజీని అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో 89.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది.
హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో.. రెక్టాంగులర్ ఐలాండ్‌లో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. కెమెరా ఐలాండ్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్ ఉన్నాయి. 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మోడల్ రిలీజ్ కానుంది. Infinix Hot 11 2022 ఫోన్‌కు కుడి వైపున ఫింగర్‌ప్రింట్ రీడర్, వాల్యూమ్ రాకర్ వంటివి ఉన్నాయి. హాట్ 11 2022 ఫోన్ 5,000 mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ‘మ్యాజిక్ ట్రైల్స్ ప్యాటర్న్’ డిజైన్ ఉంటుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. అయితే ఇన్పినిక్స్ హాట్ 11 2022 మోడల్ ధర, ఇతర ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.