హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Indus: ఇండియన్స్ కోసం మరో సూపర్‌ గేమ్‌.. ఇండస్ బ్యాటిల్ రాయలే గేమ్‌ప్లే ట్రైలర్ లాంచ్..

Indus: ఇండియన్స్ కోసం మరో సూపర్‌ గేమ్‌.. ఇండస్ బ్యాటిల్ రాయలే గేమ్‌ప్లే ట్రైలర్ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ గేమర్స్ కోసం మరో సూపర్ గేమ్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆ గేమ్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఆండ్రాయిడ్‌లో ప్రీ- రిజిస్ట్రేషన్‌ అందుబాటులో ఉంచారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లకు ఉన్న క్రేజ్‌ మనకు తెలిసిందే. గతంలో పబ్జీ, ఫ్రీ ఫైర్‌ వంటివి దేశంలో పాపులర్ అయ్యాయి. ఇండియాలో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ఇదే తరుణంలో ఇండియన్ గేమర్స్ కోసం మరో సూపర్ గేమ్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆ గేమ్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఆండ్రాయిడ్‌లో ప్రీ- రిజిస్ట్రేషన్‌ అందుబాటులో ఉంచారు. పూణేకు చెందిన గేమ్‌ డెవలపర్‌ సూపర్‌గేమింగ్‌ అనే సంస్థ ఇప్పుడు ఇండస్‌ బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌ (Indus Battle Royale Game)ను డెవలప్ చేసింది. ఈ గేమ్‌కు సంబంధించి 21 సెకన్లు ఉన్న వీడియోను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే ఇందులో వివరాలు ఏవీ వెల్లడించలేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం భారతీయ సంగీతం మాత్రం ఓ మంచి రిథమ్‌లో వినిపిస్తుంది.

అదిరిపోయిన ట్రైలర్‌..

ఇండస్‌ బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇది యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రత్యేకమైన ఆయుధాలు, అందులోని పాత్రలు, వాళ్లు ఉపయోగించే వాహనాలు, వేరే వేరే లోకేషన్లలలో అదిరిపోయే ఫైర్‌ ఫైట్స్‌ వంటివి ఆకట్టుకున్నాయి. ఈ గేమ్‌ పబ్జీకి పోటీ అవ్వొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్యాక్‌డ్రాప్‌గా పురాణాలు

గేమ్‌లోని పాత్రలు కూడా హైలెట్‌గా నిలుస్తున్నాయి. భారతీయ పురాణాల్లోని కథల నుంచి స్ఫూర్తి పొంది వీటిని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులోని ‘బిగ్‌-గాజ్‌’ (Big-Gaj) అనే పాత్ర ఏనుగు ముఖాన్ని కలిగి ఉంటుంది. విర్లోక్‌ (Virlok) అనే దాన్ని చూసిన అలాంటి భావనే కలుగుతుంది.

సూపర్‌గేమింగ్‌ సంస్థ గతంలో సిల్లీ రాయల్‌, మాస్క్‌ గన్‌ అనే రెండు గేమ్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకురాబోతున్న ఇండస్‌ బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అపెక్స్‌ లెజెండ్స్‌ (Apex Legends), ఫోర్ట్‌ నైట్‌ (Fortnite), పబ్జీ(PUBG) వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. కొత్త గేమ్ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా సూపర్‌గేమింగ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రాబీ జాన్‌ మాట్లాడారు. ఏడాదిగా తాము తయారు చేస్తున్న ఈ రాయల్‌ గేమ్‌ను ప్రపంచంతో పంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే..

ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే గేమ్ అందుబాటులోకి రానుంది. ఈ యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. iOS, ఐప్యాడ్‌ ఓఎస్‌ వాడే వారికి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాబీ జాన్‌ వెల్లడించారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ఆసక్తికరమైన ఇన్‌-గేమ్‌ సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

రిలీజ్‌ ఎప్పుడు?

అయితే ఈ సూపర్‌ గేమ్‌ రిలీజ్‌ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. గేమ్‌ కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేయలేదు. ఆప్షనల్‌గా పెట్టారు. ఉచితంగా కూడా ఆడే అవకాశం ఉంది.

First published:

Tags: Android, Video

ఉత్తమ కథలు