ప్రముఖ దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో (IndiGo) సేవలు ప్రారంభమై నేటికి (ఆగస్టు 4) 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ శుభ సందర్భంగా ఇండిగో కస్టమర్ల(Customers)కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థ తాజాగా "స్వీట్ 16 (Sweet 16)" ఆఫర్‌ను ప్రకటించింది. 16వ వార్షికోత్సవంలో భాగంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ అన్ని దేశీయ రూట్లలో ప్రయాణించే వారికి వర్తిస్తుంది. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 5 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో.. ప్రభుత్వ పన్నులు, విమానాశ్రయ ఛార్జీలు మినహా రూ.1,616 ప్రారంభ ధరలతోనే విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న టికెట్స్ ద్వారా 2022 ఆగస్టు 18, నుంచి 2023 జులై 16 మధ్య ప్రయాణాలు చేయవచ్చు.
అలానే కస్టమర్లు కోటక్ బ్యాంక్ కా-చింగ్ (Kotak Bank Ka-ching) కార్డ్‌లను ఉపయోగించి ఫ్లైట్ బుకింగ్‌పై 1000 రివార్డ్ పాయింట్లను అందుకోవచ్చు. బుకింగ్ కోసం HSBC క్రెడిట్ కార్డ్‌లను వాడినా కనీస ట్రాన్సాక్షన్ వ్యాల్యూ రూ.3500పై రూ.800 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ (Cash Back)పొందవచ్చు. తమ కంపెనీ చవకైన సేవలను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన ఈ క్షణం తమకు చాలా ముఖ్యమైనదని.. అందుకే వార్షికోత్సవ సేల్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించామని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ఈ ఆఫర్ తోడ్పడుతుందని ఆయన అన్నారు. సమయానికి, సురక్షితమైన, సరసమైన విమాన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఎయిర్‌లైన్స్ తన నిబద్ధతని కూడా పటిష్టం చేస్తుందని చెప్పారు.
స్వీట్ 16 ఆఫర్ ఇండిగో వెబ్‌సైట్, Mweb, మొబైల్ యాప్‌లో చేసిన బుకింగ్‌లపై వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ మరే ఇతర ఆఫర్, స్కీమ్ లేదా ప్రమోషన్‌తో కలపడానికి వీలుండదు. అలానే దీనిని కస్టమర్లు బదిలీ చేయలేరు, మార్చుకోలేరు, ఎన్‌క్యాష్ కూడా చేసుకోలేరు. ఈ వార్షికోత్సవ ఆఫర్ (Offer)గ్రూప్ బుకింగ్‌లకు కూడా వర్తించదని ప్రయాణికులు గమనించాలి. తన వెబ్‌సైట్ బుకింగ్ పేజీలో ఎయిర్‌లైన్ ఆఫర్ కింద "పరిమిత ఇన్వెంటరీ" అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్స్‌ను ఆఫర్ కింద బుక్ చేయడం కుదురుతుంది. అయితే ఎన్ని టికెట్స్‌ను కంపెనీ ఆఫర్ కింద అందుబాటులో ఉంచుతుందనేది తెలియలేదు. ఇండిగో, 280కి పైగా విమానాలతో ప్రతిరోజూ 1,600 ట్రిప్స్ వేస్తోంది. ఈ సంస్థ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద తక్కువ-ధర క్యారియర్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Flight tickets, IndiGo, Kotak Mahindra Bank