ఇంటర్నెట్‌లో యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ వార్ హీటెక్కుతుంటే భారతదేశానికి చెందిన 'మిత్రో' యాప్ రికార్డులు సృష్టిస్తోంది. టిక్‌టాక్‌కు పోటీగా రూపొందించిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇది. నెల రోజుల్లోనే 50 లక్షల సార్లు డౌన్‌లోడ్స్‌తో రికార్డ్ సృష్టించింది ఈ యాప్. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రోజూ 5 లక్షల డౌన్‌లోడ్స్ జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ యాప్‌కు పెట్టిన పేరు కూడా ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి ఓ కారణం. స్నేహితులను ఉద్దేశించి 'మిత్రో' అని హిందీలో పిలుస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ఇచ్చే ప్రతీ స్పీచ్‌లో 'మిత్రో' అనే పదం తప్పకుండా ఉంటుంది. అలా ఈ పదం ప్రజలకు బాగా అలవాటైపోయింది. ఇప్పుడు టిక్‌టాక్‌కు పోటీగా రూపొందించిన యాప్‌కు 'మిత్రో' అని పేరు పెట్టడంతో నెటిజన్లలో బాగా క్రేజ్ సంపాదించింది.
ఐఐటీ రూర్కీకి చెందిన విద్యార్థి 'మిత్రో' యాప్‌ను రూపొందడం విశేషం. అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్. చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్ లాగానే ఉంటుంది. స్వైప్ చేసి వీడియోలు చూడొచ్చు. వీడియోలు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశమంతా యాంటీ చైనా సెంటిమెంట్ ఉండటం కూడా 'మిత్రో' యాప్‌కు క్రేజ్ రావడానికి మరో కారణం. సైనప్ చేసిన తర్వాత రికార్డ్ బటన్ ప్రెస్ చేసి వీడియో రికార్డ్ చేసి పబ్లిష్ చేస్తే చాలు.
ఇవి కూడా చదవండి:
Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile App, Playstore, Tik tok, Tiktok