హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Microsoft Edge: మైక్రోసాఫ్ట్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఇలా చేయకపోతే డేంజర్‌లో పడ్డట్లే..!

Microsoft Edge: మైక్రోసాఫ్ట్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఇలా చేయకపోతే డేంజర్‌లో పడ్డట్లే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Microsoft Edge: మైక్రోసాఫ్ట్ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఒక ప్రమాదకరమైన సాంకేతిక లోపం (Vulnerability) ఉన్నట్లు ఈ సంస్థ మైక్రోసాఫ్ట్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Microsoft Edge: పాపులర్ బ్రౌజర్లలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge) ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో థర్డ్ పాపులర్ బ్రౌజర్‌గా ఇది నిలుస్తోంది. దీనిని చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే వారందరికీ తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఒక ప్రమాదకరమైన సాంకేతిక లోపం (Vulnerability) ఉన్నట్లు ఈ సంస్థ మైక్రోసాఫ్ట్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఈ లోపం ద్వారా రిమోట్ అటాకర్‌ లేదా హ్యాకర్ యూజర్ కంప్యూటర్‌కు యాక్సెస్‌ను సులభంగా పొంది దానిని కంట్రోల్ చేయగలుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సెక్యూరిటీ సమస్య 109.0.1518.61కి ముందు ఎడ్జ్ వెర్షన్లు వాడుతున్న వారిని ప్రమాదంలో పడి వేస్తుందని వివరించింది.

Smart Phone Tips: గుడ్ ఐడియా.. రూపాయి ఖర్చు లేకుండా రూ.20వేలు ఆదా..

CERT-In తాజా పోస్ట్‌లో ఈ విషయం గురించి చాలా వివరంగా తెలిపింది. ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోని ఆ లోపాన్ని ఉపయోగించుకోగలిగితే, వారు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్‌ను పొందగలరని, టర్న్ ఆన్ చేసి ఉన్న ఎలాంటి సెక్యూరిటీస్‌నైనా దాటవేయగలరని తెలిపింది. తద్వారా యూజర్ల పర్సనల్ సమాచారం దొంగిలించడానికి లేదా యూజర్లపై నిఘా పెట్టడానికి వీలవుతుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోని ఈ లోపం యూజర్ల కంప్యూటర్‌కు ప్రత్యేక రకమైన రిక్వెస్ట్‌ను పంపడానికి హ్యాకర్లకు మార్గం సుగమనం కూడా చేస్తుందని CERT-IN పేర్కొంది. దాని ద్వారా హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడం సులువు అవుతుంది.

పైసా వసూల్ ఆఫర్.. రూ.74 వేల 55 ఇంచుల స్మార్ట్‌టీవీ రూ. 17 వేలకే

* పరిష్కారం ఏంటి?

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఈ సెక్యూరిటీ బాడీ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో బగ్‌లు, లోపాలను కనిపెట్టి యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Chromium-based) యూజర్లకు హై సెక్యూరిటీ రిస్క్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్య చాలా పెద్దది కాబట్టి దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రమే ఫిక్స్ చేయగలదు. కాగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ లోపాన్ని ఫిక్స్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 109.0.1518.61 వెర్షన్‌ను తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ యూజర్లు ఈ కొత్త వెర్షన్‌కు తమ ఎడ్జ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.

మీ సిస్టమ్‌లో న్యూ అప్‌డేట్ అందుబాటులో ఉంటే అప్‌డేట్ ప్రాంప్ట్ పొందుతారు. లేదంటే కొత్త అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు. అందుకు బ్రౌజర్ టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సెట్టింగ్స్‌కి వెళ్లి అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (About Microsoft Edge) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం బ్రౌజర్‌ను రీలాంచ్ చేసుకుంటే సరిపోతుంది.

First published:

Tags: Microsoft, Microsoft Edge, Technology

ఉత్తమ కథలు