స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!

భారతీయులు ఎక్కువగా తమ స్మార్ట్‌ఫోన్లల్లో స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్ ఉపయోగిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: September 7, 2018, 1:56 PM IST
స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచంలో ఏఏ దేశాల్లో ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారని ఐర్లాండ్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనెడా, న్యూజిల్యాండ్‌తో పాటు జపాన్, సౌత్‌కొరియాల్లో ఎక్కువగా యాప్స్ ఉపయోగిస్తున్నారని తేలింది. ఇందుకు కారణం చాలావరకు యాప్స్ ఇంగ్లీష్ భాషలో ఉండటమేనని తేల్చారు. ఇంగ్లీష్ తక్కువగా మాట్లాడే దేశాలైన అర్జెంటీనా, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, పాకిస్తాన్, ఇండియాల్లో యాప్ యూసేజ్ తక్కువగా ఉంది. యాప్స్ ఉపయోగించేవారు కూడా స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌నే ఇష్టపడుతున్నట్టు తేలింది.

భౌగోళిక ప్రాంతం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు యాప్స్ ఉపయోగించే తీరుపై ప్రభావం చూపిస్తున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. జపాన్‌లో పర్సనలైజేషన్ యాప్స్, రష్యాలో కుటుంబానికి సంబంధించిన కేటగిరీస్, ఎడ్యుకేషన్ గేమ్స్, పేరెంటింగ్, అమెరికాలో ఎంటర్‌టైన్‌మెంట్, ట్రావెల్, స్పోర్ట్స్, హెల్త్, ఫిట్‌నెస్, మ్యూజిక్, ఆడియో యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఈ అధ్యయనం కోసం భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 44 దేశాల్లో 25,323 మంది ఆండ్రాయిడ్ యూజర్స్ ఉపయోగిస్తున్న 54,776 యాప్స్ విశ్లేషించారు. అధ్యయన ఫలితాలను స్పెయిన్‌లో జరిగిన ఏసీఎం మొబైల్ హెచ్‌సీఐ 2018లో ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!
First published: September 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading