Flipkart: సీరియల్ నటుడికి షాక్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏమి వచ్చిందో తెలుసా..

నటుడి ట్వీట్

Flipkart: ఈ-కామర్స్ కంపెనీలు పొరపాట్లు చేయడం కొత్తేం కాదు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు ఆర్డర్ చేస్తే సబ్బులు, రాళ్లు డెలివరీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి! ఇలాంటి ఛేదు అనుభవాలతో ఆశ్చర్యపోయిన వారెందరో.. తాజాగా అనుపమ టీవీ సీరియల్ ఫేమ్ పరాస్ కల్నావత్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

  • Share this:
ఈ-కామర్స్(E Commerce) కంపెనీలు పొరపాట్లు చేయడం కొత్తేం కాదు. ల్యాప్‌టాప్‌లు(Laptops), ఫోన్లు(Phones) ఆర్డర్ చేస్తే సబ్బులు, రాళ్లు డెలివరీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఇలాంటి ఛేదు అనుభవాలతో ఆశ్చర్యపోయిన వారెందరో..తాజాగా అనుపమ (Anupamaa) టీవీ సీరియల్ ఫేమ్ పరాస్ కల్నావత్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్(flifkart) చేసిన తప్పుతో అతడికి మతిపోయినంత పనయ్యింది. ఇటీవల కల్నావత్‌ ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఇయర్-1 (Nothing Ear-1) ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టాడు.

WhatsApp Features: త్వరలోనే వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్లు.. ఇక ప్రత్యర్థి యాప్స్​కు చుక్కలే..


కొద్దిరోజుల్లోనే అతడి ఇంటికి ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ బాయ్ ఓ బాక్స్ తెచ్చిచ్చాడు. అది తెరిచి చూడగా ఆ బాక్స్‌లో ఇయర్ ఫోన్స్ కు బదులు ఏమి (నథింగ్) కనిపించలేదు. దీంతో షాకైన సదరు నటుడు ప్యాకేజింగ్ తప్పును తెలియజేస్తూ ఖాళీ బాక్స్ కు సంబంధించిన ఇమేజెస్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఫ్లిప్‌కార్ట్ తనకు అందించిన ఇయర్ ఫోన్స్ డెలివరీ బాక్స్‌లో ఏమి ప్యాక్ చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దిగ్గజ సంస్థ కస్టమర్లతోపాటు దానికున్న ప్రఖ్యాతిని కోల్పోతుందని అతడు మండిపడ్డాడు.


Nokia Smart Phone : నోకియా నుంచి అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చిందోచ్ ​.. అది తక్కువ ధరకు అందుబాటులో..


ఫ్లిప్​కార్ట్​పై మండిపడ్డ నటుడు..
పరాస్ ట్వీట్ చేస్తూ.. “ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిన నథింగ్ ఇయర్ ఫోన్స్ బాక్స్‌లో నేను ఏమీ పొందలేదు. నిజానికి ఫ్లిప్‌కార్ట్ కాలక్రమేణా మరింత దిగజారుతోంది. డెలివరీ సేవలు ఇలాగే కొనసాగితే త్వరలో ప్రజలు ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రొడక్ట్స్ కొనడం ఆపేస్తారనేది అక్షర సత్యం." అని తన ఆవేదన వెల్లగక్కాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఫ్లిప్‌కార్ట్ దిద్దుబాటు చర్యలకు దిగింది."మీకు ఛేదు అనుభవం ఎదురైందని తెలుసుకొని చింతిస్తున్నాం.



ఆర్డర్ గురించి మీ ఆందోళనను మేము అర్థం చేసుకున్నాం. మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడీని మాకు తెలియజేయండి. మేము దానిని పరిశీలించి మీకు తగిన సహాయం చేస్తాం. మీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాం" అని ఫ్లిప్‌కార్ట్ ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ స్పందించింది.



అయితే కల్నావత్‌కు ఎదురైన అనుభవమే తమకు కూడా ఎదురైందని చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏదీ ఆర్డర్ చేయకూడదని కొందరు తోటి నెటిజన్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. భారతదేశంలోని దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే చాలా తప్పులు చేసేసింది. గాడ్జెట్‌లను ఆర్డర్ చేసిన కస్టమర్లకు ఇటుకలు, డిటర్జెంట్ బార్‌లు, ఆపిల్స్ వంటివి ప్యాక్​ చేసి పంపించినఘటనలెన్నో!
Published by:Veera Babu
First published: