పొల్యూషన్‌కి సొల్యూషన్... స్వచ్ఛమైన గాలి కోసం స్మార్ట్ హెల్మెట్!

ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ కాబట్టి అక్కడ టూవీలర్లు నడిపేవారికి ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాదు... వాయుకాలుష్యం తీవ్రంగా ఉండే మెట్రోనగరాల్లో ఈ స్మార్ట్‌ హెల్మెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ హెల్మెట్‌ను తొలిసారిగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2018లో ప్రదర్శించారు. నవంబర్ రెండోవారంలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ హెల్మెట్ ధర రూ.3,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటుందని అంచనా.

news18-telugu
Updated: November 1, 2018, 3:05 PM IST
పొల్యూషన్‌కి సొల్యూషన్... స్వచ్ఛమైన గాలి కోసం స్మార్ట్ హెల్మెట్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్మార్ట్‌ఫోన్ చూశాం. స్మార్ట్‌వాచ్ కూడా చూశాం. చాలావరకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. ఇప్పుడు బైక్ రైడర్స్‌ కోసం స్మార్ట్ హెల్మెట్ వచ్చేసింది. అవును... టూవీలర్ డ్రైవ్ చేసే సమయంలో కాలుష్యం తీవ్రంగా ఉందని బాధపడేవారికి ఇది శుభవార్తే. స్మార్ట్‌హెల్మెట్ పెట్టుకుంటే... డ్రైవింగ్ సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చొచ్చు. ఢిల్లీకి చెందిన స్టార్టప్ షెల్లియోస్ తయారుచేసిన స్మార్ట్ హెల్మెట్ ఇది. ఈ స్మార్ట్‌ హెల్మెట్‌లో ఉండే ఎయిర్ ప్యూరిఫైర్ స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ హెల్మెట్ సత్ఫలితాలను ఇవ్వడంతో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నవంబర్ రెండో వారంలో స్మార్ట్ హెల్మెట్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ కాబట్టి అక్కడ టూవీలర్లు నడిపేవారికి ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాదు... వాయుకాలుష్యం తీవ్రంగా ఉండే మెట్రోనగరాల్లో ఈ స్మార్ట్‌ హెల్మెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ హెల్మెట్‌ను తొలిసారిగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2018లో ప్రదర్శించారు. నవంబర్ రెండోవారంలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ హెల్మెట్ ధర రూ.3,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటుందని అంచనా.

ఎయిర్ ప్యూరిఫైర్ ఎలా పనిచేస్తుంది?
ఈ హెల్మెట్ వెనుకవైపు పైభాగంలో ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. బయటి గాలిని ఈ ఎయిర్ ప్యూరిఫైర్ పీల్చుకొని శుభ్రం చేస్తుంది. రైడర్లకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఎయిర్ ప్యూరిఫైర్ 2600 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. మైక్రో యూఎస్‌బీ పోర్టుతో ఛార్జింగ్ చేయొచ్చు. హెల్మెట్‌కు ఉన్న బ్లూటూత్‌ని మొబైల్‌కి కనెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు కాషన్ లైట్ ఉంటుంది. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. హెల్మెట్ వెనుకవైపు ఉన్న ప్యానెల్ తొలగించి మీరే శుభ్రం చేసుకోవచ్చు. హెల్మెట్ బరువు కిలోన్నర ఉంటుంది. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ హెల్మెట్‌ని తయారు చేశారు.

ఇవి కూాడా చదవండి:

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?

యాపిల్ వాచ్ ప్రాణాలు ఎలా కాపాడిందో తెలుసా?Video: గోవా వెళ్తున్నారా? అక్కడ మారిన రూల్స్ తెలుసా?

జాయింట్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొంటున్నారా?
Published by: Santhosh Kumar S
First published: November 1, 2018, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading