• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • INDIAN SPACE RESEARCH ORGANISATION ISRO WAS TARGETED BY NORTH KOREAN HACKERS DURING CHANDRAYAAN 2 MISSION SAYS REPORT SS

ISRO: షాక్... చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇస్రోను టార్గెట్ చేసిన నార్త్ కొరియన్ హ్యాకర్లు

ISRO: షాక్... చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇస్రోను టార్గెట్ చేసిన నార్త్ కొరియన్ హ్యాకర్లు

ISRO: షాక్... చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇస్రోను టార్గెట్ చేసిన నార్త్ కొరియన్ హ్యాకర్లు (ప్రతీకాత్మక చిత్రం, image: ISRO)

ISRO | నార్త్ కొరియన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న లజారస్ గ్రూప్‌కు చెందినట్టుగా భావిస్తున్న డీట్రాక్ మాల్‌వేర్‌తో ఈ దాడి జరిగినట్టు ఈ కథనం సారాంశం.

  • Share this:
    చంద్రయాన్ 2... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌పై దేశమంతా ప్రత్యేక ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్ 2 స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దిగే సమయంలో ఇస్రోను ఉత్తర కొరియా హ్యాకర్లు టార్గెట్ చేశారన్న వార్తలు రావడం కలకలం రేపుతోంది. డెయిలీ మెయిల్‌లో వచ్చిన కథనం ప్రకారం భారతదేశానికి చెందిన ఐదు ప్రభుత్వ సంస్థలపై ఉత్తర కొరియా హ్యాకర్లు దాడి చేశారు. అందులో ఇస్రో కూడా ఒకటి. అయితే హ్యాకర్ల దాడి చంద్రయాన్ ప్రయోగంపై ప్రభావం చూపిందా అన్న వాదనల్ని ఇస్రో ఖండించింది. నార్త్ కొరియన్ స్పామర్స్ పంపిన ఫిషింగ్ ఇమెయిల్స్‌ని ఇస్రో ఉద్యోగులు ఓపెన్ చేయడంతో సిస్టమ్స్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయినట్టు తేలింది. హ్యాకర్ల దాడి గురించి సెప్టెంబర్‌లోనే ఇస్రోకు సమాచారం అందిందని ఫైనాన్షియల్ టైమ్స్ మరో కథనాన్ని ప్రచురించింది. నార్త్ కొరియన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న లజారస్ గ్రూప్‌కు చెందినట్టుగా భావిస్తున్న డీట్రాక్ మాల్‌వేర్‌తో ఈ దాడి జరిగినట్టు ఈ కథనం సారాంశం.

    భారతదేశానికి చెందిన 18 ఆర్థిక సంస్థలు, పరిశోధన కేంద్రాల్లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కీ వెల్లడించింది. కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి జరిపింది కూడా ఇదే మాల్‌వేర్ కావొచ్చని అనుమానిస్తున్నారు. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ నుంచి సమాచారం రావడంతో హానికరమైన సైబర్ కార్యకలాపాలు, సైబర్ దాడుల్ని అడ్డుకోవడానికి సెప్టెంబర్ 3న నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత దాన్ని డీట్రాక్ మాల్‌వేర్‌గా గుర్తించారు. సరిగ్గా చంద్రయాన్ 2 చంద్రుడిపైకి దిగడానికి 2 రోజుల ముందే ఈ సైబర్ దాడుల గురించి ప్రభుత్వ సంస్థలకు సమాచారం అందింది.

    Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే



    ఇవి కూడా చదవండి:

    Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి

    App: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

    IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర
    First published:

    అగ్ర కథనాలు