Rail Madad: రైలు ప్రయాణంలో సమస్యలా? ఈ యాప్‌లో కంప్లైంట్ ఇవ్వండి

Rail Madad: రైలు ప్రయాణంలో సమస్యలా? ఈ యాప్‌లో కంప్లైంట్ ఇవ్వండి (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways Rail Madad | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే అనేక యాప్స్ అందిస్తోంది. అందులో 'రైల్ మదద్' యాప్ కూడా ఒకటి. రైల్వేకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు తీసుకునేందుకు ఉపయోగపడే యాప్ ఇది.

  • Share this:
    మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? రైళ్లల్లో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? రైల్వే స్టేషన్లలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రైల్వే అధికారులకు ఎలా కంప్లైంట్ చేయాలో అర్థం కాలేదా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం 'రైల్ మదద్' యాప్. భారతీయ రైల్వేకు సాంకేతిక సహకారం అందించే సంస్థ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తయారు చేసిన యాప్ ఇది. యాప్ మాత్రమే కాదు... 'రైల్ మదద్' పోర్టల్ కూడా ఉంది. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించేందుకు 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది భారతీయ రైల్వే. ప్రయాణికులు రైల్వేకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాదు... తమ కంప్లైంట్లకు సంబంధించిన స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణం, సరుకు రవాణా, పార్శిల్ డెలివరీ లాంటి సమస్యలకు కూడా ఈ యాప్‌లో కంప్లైంట్స్ స్వీకరిస్తుంది రైల్వే.

    మీరు రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్టైతే 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. https://railmadad.indianrailways.gov.in/ వెబ్‌సైట్ లేదా 'రైల్ మదద్' యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. 'రైల్ మదద్' యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఈ యాప్ 12 భాషల్లో సేవల్ని అందిస్తుంది. ఇందులో కంప్లైంట్ ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు. మీరు 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించాలంటే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. మీ దగ్గర పీఎన్ఆర్ నెంబర్ ఉంటే వెల్లడించాలి. మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్‌లోడ్ చేయొచ్చు. ఫిర్యాదు నేరుగా ఫీల్డ్ యూనిట్‌కు వెళ్తుంది. ప్రతీ కంప్లైంట్‌కు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్‌తో మీ కంప్లైంట్ స్టేటస్, ఫీడ్ బ్యాక్ తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కాగానే మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ వస్తాయి.


    ఫిర్యాదులు చేయడం మాత్రమే కాదు... ప్రయాణికులు రైల్వేకు తమ విలువైన సలహాలు, సూచనలు కూడా 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇవ్వొచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో రైల్ మదద్ యాప్‌ను ఇప్పటికే 50,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే railmadadcris@gmail.com మెయిల్ ఐడీకి మెయిల్ చేసి అడగొచ్చు. మరి మీరు కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    IRCTC Andaman Tour: తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్

    IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి అరకు, సింహాచలం టూర్ ప్యాకేజీ

    IRCTC Dubai Tour: దుబాయ్ టూర్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... మహిళలకు మాత్రమే ఛాన్స్
    Published by:Santhosh Kumar S
    First published: