రైల్వే స్టేషన్‌లో టికెట్ ఫ్రీ..ఫ్రీ.. ఆ చిన్న పని చేస్తే చాలు..

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆదేశించింది.

రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇలాంటి పద్దతులనే అవలంభిస్తున్నాయి. స్క్వాట్ అండ్ రైడ్ పేరుతో సబ్‌వే స్టేషన్‌లో ఈ మెషీన్లు ఏర్పాటుచేశారు.

  • Share this:
    ఇండియన్ రైల్వే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. ఓ చిన్నపని చేస్తే ఇకపై రైల్వే స్టేషన్‌లో ఫ్రీగా టికెట్ తీసుకోవచ్చు. అవును.. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. దానికి సంబంధించి మంత్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఫిట్‌నెస్ మెషీన్ ఏర్పాటు చేశారు. ఆ మెషీన్ ముందు నిలబడి 30 సిటప్స్ (గుంజీలు) తీస్తే ఉచితంగా ఫ్లాట్ ఫామ్ టికెట్ వస్తుంది.

    సిటప్స్ మెషీన్‌తో ఆరోగ్యం మెరుగుపడడమే కాదు..డబ్బులు కూడా ఆదా అవుతాయంటోంది రైల్వేశాఖ. రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇలాంటి పద్దతులనే అవలంభిస్తున్నాయి. స్క్వాట్ అండ్ రైడ్ పేరుతో సబ్‌వే స్టేషన్‌లో ఈ మెషీన్లు ఏర్పాటుచేశారు. ఆ స్ఫూర్తితోనే భారత్‌లోనూ ఫిట్‌నెస్ మెషీన్లను ఏర్పాటు చేస్తోంది రైల్వేశాఖ. త్వరలోనే దేశవ్యాప్తంగా వీటిని తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: