Indian Railways: ఈ యాప్ ఉంటే... మీ రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు

NTES App | ఈ యాప్ ఉంటే రైళ్ల ఆలస్యం, రైలు స్టేషన్‌కు చేరుకునే సమయం, ప్రస్తుతం రైలు ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకోవడం సులువు. దీని ద్వారా ప్రయాణికుల సమయం చాలావరకు ఆదా అవుతుంది.

news18-telugu
Updated: June 28, 2019, 3:02 PM IST
Indian Railways: ఈ యాప్ ఉంటే... మీ రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు
Indian Railways: ఈ యాప్ ఉంటే... మీ రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? సమయానికి స్టేషన్‌కు వెళ్తే... రైలు ఆలస్యంగా నడుస్తోందన్న సమాచారం అందిందా? ఇలాంటి అనుభవాలు రైలు ప్రయాణికులకు ఎప్పుడూ ఎదురయ్యేవే. అందుకే మీరు ఇంట్లోంచి బయల్దేరడానికన్నా ముందే రైలు ఎక్కడ ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం 'డిజిటల్ ఇండియా డిజిటల్ రైల్' కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. అదే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్-NTES App. ఈ యాప్ ఉంటే రైళ్ల ఆలస్యం, రైలు స్టేషన్‌కు చేరుకునే సమయం, ప్రస్తుతం రైలు ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకోవడం సులువు. దీని ద్వారా ప్రయాణికుల సమయం చాలావరకు ఆదా అవుతుంది.


NTES App: ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి...




NTES యాప్‌ను సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS రూపొందించింది. మీరు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి NTES App డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే కోటిసార్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. యాప్‌లో హోమ్ పేజీలోనే మీకు Spot Your Train, Live Station, Train Schedule, Trains between Stations, Cancelled Trains, Rescheduled Trains, Diverted Trains, Manage favourite trains, stations and train schedules, అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే Spot Your Train పైన క్లిక్ చేసి ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రైలు ఎక్కడ ఉందన్న విషయంతో పాటు ఆలస్యంగా నడుస్తుంటే ఆ సమాచారం తెలుస్తుంది. అంతేకాదు... రైలు ఎక్కడ ఉందో మ్యాప్‌లో చూసి తెలుసుకోవచ్చు.
Loading...
Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ

Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...