ప్రతిరోజూ ఆన్‌లైన్ ద్వారా లక్షలాది రైల్వే టికెట్లు విక్రయిస్తున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సంస్థ.. కాలర్ ఐడెంటిఫికేషన్ ప్లాట్‌ఫాం ట్రూకాలర్‌తో (Truecaller) ఒప్పందం చేసుకుంది. ఈ-టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో వినియోగదారులు మోసపోకుండా వెరిఫైడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ట్రూకాలర్‌తో జట్టు కట్టడంతో లక్షలాదిమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న 139 రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్‌ను ట్రూకాలర్ బిజినెస్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ధ్రువీకరించింది.
రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి కాల్ చేసే సమయంలో ఇక నుంచి వినియోగదారులకు ట్రూకాలర్‌లో గ్రీన్ వెరిఫైడ్ బిజినెస్ లోగో కనిపించనుంది. వినియోగదారులకు ఐఆర్‌సీటీసీ ధ్రువీకరించిన మెసేజ్‌ల ద్వారా మాత్రమే టికెట్ బుకింగ్స్, ప్రయాణ వివరాల సమాచారం అందుతుందని ట్రూకాలర్ తెలిపింది. వెరిఫైడ్ టిక్ మార్కు ద్వారా ట్రూకాలర్‌లో భారత రైల్వే లోగో ఫోటోతో సహా కనిపిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు మోసాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజని హాసిజా తెలిపారు.
Jio eSIM: ఆ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? జియో ఇ-సిమ్ ఎలా పొందాలంటే
ట్రూకాలర్‌తో కలసి పనిచేయడం మంచి విషయమని హాసిజా చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులకు నమ్మకమైన, సురక్షితమైన సమాచారం అందిస్తూ, వారిలో సంస్థపై నమ్మకం పెంచుతామని వివరించారు.
భారత్ బీపీవో సర్వీసెస్ ద్వారా 2007లో IRCTC హెల్ప్ లైన్ నెంబర్ 139ని ప్రారంభించారు. ప్రతి రోజు 2 లక్షల మంది వినియోగదారులు ఈ నెంబర్‌కు కాల్ చేసి టికెట్ల రిజర్వేషన్, రైళ్ల రాకపోకల సమయాలను తెలుసుకుంటున్నారు. వీటితోపాటు వైద్య సేవలు, రక్షణ సంబంధిత కాల్స్, ప్రత్యేక అవసరాలకు ఈ నంబర్‌ను వినియోగిస్తున్నారు.
JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.300 చాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థలో భారత రైల్వే కూడా స్థానం సంపాదించింది. దేశంలో ప్రతి రోజూ 3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలను కలుపుతూ 68000 కిలోమీటర్ల రైల్వే మార్గాలతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. 18 జోన్లలో 13 లక్షల మంది ఉద్యోగులు రైల్వే శాఖలో సేవలందిస్తున్నారు. కోట్లాది మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే కాదు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి ఇండియన్ రైల్వే సగర్వంగా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, IRCTC, Railways, Train, Train tickets, Travel, Truecaller