కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండటంతో క్యాష్ లెస్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. జాతీయ రహదారులపై టోల్స్ చెల్లించేందుకు ఫాస్టాగ్ లాంటి నగదు రహిత లావాదేవీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. తాజాగా పెట్రోల్ బంకుల్లోనూ కాంటాక్ట్ లెస్ రీఫ్యూయలింగ్ కోసం ఫాస్టాగ్‌ను ఉపయోగించనున్నట్లు ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు తన వినియోగదారులకు ఫాస్టాగ్ ద్వారా పెట్రోల్ రీఫ్యూయలింగ్ సేవలను అందిస్తోంది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి పనిచేసేందుకు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. "ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్ వినియోగదారులు ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రెల్ బంకుల్లో క్యాష్‌లెస్ సేవలు పొందవచ్చు. ఇది కస్టమర్ల సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఫిల్లింగ్ స్టేషన్లలో కస్టమర్లు ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ గురించి సిబ్బందికి తెలియజేయాలి. వారు వాహనం ఫాస్టాగ్ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తారు. ఓటీపీ ద్వారా ట్రాన్సాక్షన్‌ను ధ్రువీకరించుకుంటారు. పీఓఎస్ యంత్రంలో ఓటీపీ నమోదు చేసినప్పుడు లావాదేవీ పూర్తవుతుంది" అని ఇండియన్ ఆయిల్, ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించాయి. Flipkart Big Saving Day: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లపై భారీ తగ్గింపు.. వివరాలివే
జాతీయ రహదారులపై టోల్ వసూళ్లు చేసే సమయంలో ఇబ్బందులను ఫాస్టాగ్ తొలగిస్తుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను ఇండియన్ ఆయిల్ ఆటోమేషన్ సిస్టంతో అనుసంధానం చేశారు. దీని ద్వారా పెట్రోల్ బంకుల్లో ఇంధనం కోసం వెళ్లేవారు డిజిటలైజ్డ్ సేవలను పొందవచ్చు. భారతదేశం అంతటా మూడు వేల ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
రానున్న ఆర్థిక సంవత్సరాల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం 10 నుంచి 14 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఐసీఐర్ఏ అంచనా వేసింది. ఈ క్రమంలో కస్టమర్లకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన ఇండియన్ ఆయిల్ సంస్థ.. వ్యక్తుల ప్రమేయం లేకుండా డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఫాస్టాగ్ ఫిల్లింగ్ సేవలను ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.