Home /News /technology /

INDIAN MESSAGING APP HIKE STICKER CHAT HAS BEEN SHUT DOWN NS GH

ఆ మెసేజింగ్ యాప్ సంచలన నిర్ణయం.. షట్ డౌన్ ప్రకటించిన సీఈఓ.. కారణం అదేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hike messaging app shuts down: 2012లో హైక్ యాప్ కు మంచి హైప్ వచ్చింది. హైక్ స్టిక్కర్ చాట్స్ అని కూడా మనం పిలుచుకున్న ఫ్రీవేర్, ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ ఆ తర్వాతి కాలంలో వాట్సప్ ధాటికి తట్టుకుని నిలదొక్కుకోలేక పోయింది. దీంతో..

ఇంకా చదవండి ...
ఏం చేస్తున్నావ్.. ఎక్కడున్నావ్.. ట్రాఫిక్ జాం ఉందా.. తిన్నావా.. పడుకున్నావా.. బోర్ కొడుతోంది.. నిన్ను చూడాలనుంది.. వీడియో కాల్..మనసు బాలేదు కాసేపు చాట్ చేస్తావా.. ఇలాంటి విషయాలన్నింటికీ కేరాఫ్ గా నిలుస్తున్నాయి మెసేజింగ్ యాప్స్. నిరంతరం అయినవారితో, ఆత్మ బంధువులతో, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ అనుక్షణం అప్డేట్స్ ఇచ్చుకునేందుకు మెసేజింగ్ యాప్స్ పై మనమంతా ఆధారపడుతున్నాం. ఇలాంటి మెసేజింగ్ యాప్స్ లో వాట్సప్ కు ఉన్నంత ప్రజాదరణ మరే ఇతర మెసేజింగ్ యాప్ కు లేదు. కానీ వాట్సప్ కు పోటీగా ఇలాంటి యాప్స్ చాలా వచ్చాయి. మన భారతీయులు రూపొందించిన హైక్ మెసేజింగ్ యాప్(Hike messaging app) అందులో ఒకటి. అయితే ఫేస్ బుక్ వాట్సప్ ను (Facebook) సొంతం చేసుకున్నాక వాట్సప్ (WhatsApp) అనుసరించే భద్రతా విధానాలు చాలామందిలో అనుమానాలు రేకెత్తించటంతో ప్రత్యామ్నాయ యాప్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకున్న యాప్ లలో హైక్ కూడా ఒకటి.

హైప్ కు తక్కువేం లేదు..
2012లో హైక్ యాప్ కు మంచి హైప్ వచ్చింది. హైక్ స్టిక్కర్ చాట్స్ అని కూడా మనం పిలుచుకున్న ఫ్రీవేర్, ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ ఆ తర్వాతి కాలంలో వాట్సప్ ధాటికి తట్టుకుని నిలదొక్కుకోలేక పోయింది. 2016 ఆగష్టుకల్లా సుమారు 100 మిలియన్ రిజస్టర్డ్ యూజర్స్ ను సంపాదించుకుని, 10 భారతీయ ప్రాంతీయ భాషల్లో చాటింగ్ సేవలను పెద్దస్థాయిలో అందించింది. ఈలోగా హైక్ మెసేంజర్ యాప్ సీఈఓ కెవిన్ భారతీ మిట్టల్ ట్విట్టర్ లో (Twitter) చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. హైక్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు జనవరి 6న హైక్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సంస్థను ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారన్న విషయంపై ఇంకా స్పష్టతమాత్రం రావాల్సి ఉంది. మరోవైపు దీని స్థానంలో వైబ్, రష్ అనే రెండు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) ప్లాట్ ఫార్మ్స్ లో ఇవి పనిచేస్తాయి.

పెద్ద కంపెనీనే..
విశేషం ఏంటంటే పెట్టుబడుల పరంగా చూస్తే హైక్ ఏమాత్రం చిన్న సంస్థ కాదు. ఒకప్పుడు దీనికి పెట్టుబడుల వరద వచ్చిపడింది. వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించిన హైక్ యాప్ ప్రస్తుత మార్కెట్ విలువ 1.4 బిలియన్ డాలర్లకు పైమాటే. కానీ ఇండియన్ మెసేజింగ్ మార్కెట్లో వాట్సప్ పైచేయిని తట్టుకుని నిలదొక్కుకోవటం హైక్ కు అతిపెద్ద సవాలుగా మారింది. 2019 డిసెంబర్ నాటికి హైక్ కు 2 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నా.. వాట్సప్ దూకుడు ఈ కంపెనీని కుదేలు చేసిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కానీ వాట్సప్ వద్దనుకుంటున్న యూజర్స్ సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతుండటంతో సిగ్నల్ (Signal) అనే నాన్ ప్రాఫిట్ సంస్థకు ఒకే ఒక్క నెలలో 30 మిలియన్ల ఇన్స్టలేషన్స్ కొత్తగా యాడ్ అవ్వటమంటే మెసేజింగ్ ప్లాట్ ఫార్మ్ బిజినెస్ ఎంత విస్తృతమైనదో అర్థమవుతుంది. ఇలాంటి టైంలో హైక్ ను మూసేయటం ఎందకనేది ఆసక్తిగొలుపుతోంది.
Published by:Nikhil Kumar S
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు