హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Govt Bans Videos: 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!

Govt Bans Videos: 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!

Govt Bans Videos: 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!

Govt Bans Videos: 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!

Govt Bans Videos: 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం గతంలోనూ ఈ తరహా చర్యలు తీసుకుంది. అందుకు కారణం కూడా ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక చర్యలు తీసుకుంది. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపైన కఠినంగా వ్యవహరించింది. దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడంతో పాటు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన 10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నిషేధం (Ban) విధించింది. కేంద్రం గతంలోనూ ఈ తరహా చర్యలు తీసుకుంది.

అగ్నిపథ్ స్కీమ్ (Agneepath scheme), భారత సైన్యం (Indian Armed Forces), కశ్మీర్ తదితర విషయాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వం వేటు వేసిన ఆ వీడియోలకు మొత్తం వ్యుయర్స్ సంఖ్య 1.3 కోట్లు అని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ వీడియోలు రీచ్ అయ్యేలా వారు ప్లాన్ చేశారని తెలిపింది. ఈ వీడియోలపై వేటు వేయాలనే నిర్ణయం సెప్టెంబర్ 23న తీసుకున్నట్లు ఆ శాఖ స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) ప్రకారం కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

* విదేశీ సంబంధాలపైన ప్రభావం

నిషేధించిన వీడియోల్లో దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం తప్పుగా ప్రసారమైందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తప్పుడు సమాచారం వల్ల విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహ పూర్వక సంబంధాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది.

* ప్రభుత్వంపై దుష్ప్రచారం

యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేసే కంటెంట్‌ను మానిటర్ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గత మార్గదర్శకాల్లో తెలిపింది. అయినా కొన్ని ఛానళ్లు మత విద్వేషాలు రెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేశాయి. దాంతో కేంద్రం రంగంలోకి దిగి కఠినమైన చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి : రైతులకు అదిరే న్యూస్.. నెలకు రూ.3వేల పెన్షన్ అందించే స్కీమ్‌.. ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

కొన్ని సమూహాల మతపరమైన హక్కులు కేంద్ర ప్రభుత్వం హరించిందంటూ వీడియోల్లో దుష్ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మత విద్వేషాలు చెలరేగకముందే కేంద్రం అప్రమత్తమై వాటిని బ్యాన్ చేసింది. కంటెంట్ క్రియేటర్లు పబ్లిష్ చేసే వీడియోలను యూట్యూబ్‌(YouTube), కేంద్ర ప్రభుత్వం నిరంతరం మానిటర్ చేస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాయి.

* ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట

10 యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలలో వచ్చిన కంటెంట్‌లో ఫేక్ న్యూస్, మార్ఫ్‌డ్ వీ‌డియోస్‌ ఉన్నాయని, వారు కావాలనే దురుద్దేశంతో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కంటెంట్ ప్రజల్లోకి సంపూర్ణంగా వెళితే జనాలు మత సమూహాలుగా విడిపోయి దేశంలోనే పౌరుల మధ్య అంతర్యుద్ధం వచ్చే ప్రమాదముందని వివరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంది. ఈ చర్యల ద్వారా ఫేక్ న్యూస్‌కు కూడా అడ్డుకట్ట వేసినట్లయింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, National News, Youtube

ఉత్తమ కథలు