Ban on PUBG: పబ్జీ గేమ్‌తో పాటు 118 మొబైల్ యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం

PUBG Ban: పబ్జీతో పాటు మరో 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: September 2, 2020, 5:53 PM IST
Ban on PUBG: పబ్జీ గేమ్‌తో పాటు 118 మొబైల్ యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం
pubg (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు మరో 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ మొబైల్ యాప్‌ను బ్యాన్ చేయాలని గతంలో కేంద్రానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే తాజాగా పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రతకు, భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.



పబ్జీతో పాటు కేంద్రం నిషేధించిన మొబైల్స్ జాబితాలో బైదు, ఫేస్‌యూ, వియ్ ఛాట్, గేమ్ ఆఫ్ సుల్తాన్, మెసేజ్ లాక్, యాప్‌ లాక్, క్లీనర్, ఎంవీ మాస్టర్, బైక్ రేసింగ్, కిట్టి లైవ్, రూల్స్ ఆఫ్ సర్వైవల్, వీపీఎన్ ఫర్ టిక్ టాక్ వంటి మొబైల్స్ యాప్స్ ఉన్నాయి.

రెండు నెలల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం టిక్‌టాక్, హలో సహా 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ జాబితాలో టిక్టాక్, షేర్ఇట్, యుసీ బ్రౌజర్, బైదు మ్యాప్, హెలో, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్, వీబో, జెండర్, మీటు, కామ్స్కానర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్ ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ Ministry of Electronics and Information Technology (MeitY) జారీ చేసిన ఉత్తర్వులలో భారత ప్రభుత్వం ఈ 59 యాప్స్ ను భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఆ తరువాత మరిన్ని కొన్ని యాప్స్‌ను ఈ జాబితాలో చేర్చింది. తాజాగా పబ్జీ సహా మరికొన్ని మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.
Published by: Kishore Akkaladevi
First published: September 2, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading