Indian Air Force: బ్యాటిల్ గేమ్‌లో అభినందన్ వర్తమాన్‌... గేమ్ రిలీజ్ చేసిన ఐఏఎఫ్

Indian Air Force: బ్యాటిల్ గేమ్‌లో అభినందన్ వర్తమాన్‌... గేమ్ రిలీజ్ చేసిన ఐఏఎఫ్

'Indian Air Force: A Cut Above' Game | 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఏ కట్ ఎబోవ్' గేమ్ ప్రస్తుతం సింగిల్ ప్లేయర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్లేయర్స్ రకరకాల ఫైటర్ జెట్స్‌తో మిషన్స్ పూర్తి చేయాలి.

  • Share this:
    వీడియో గేమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైట్ బ్యాటిల్ సిమ్యులేటర్ గేమ్ రిలీజ్ చేసింది. భారతదేశానికి చెందిన గేమ్ డెవలపర్‌ Threye Interactive సంస్థతో కలిసి 'Indian Air Force: A Cut Above' గేమ్ రూపొందించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 33 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే 1000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా ఎయిర్ ఫైట్ గేమ్ రూపొందించడం విశేషం. ఆండ్రాయిడ్‌లో 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఏ కట్ ఎబోవ్' గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    'ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఏ కట్ ఎబోవ్' గేమ్ ప్రస్తుతం సింగిల్ ప్లేయర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్లేయర్స్ రకరకాల ఫైటర్ జెట్స్‌తో మిషన్స్ పూర్తి చేయాలి. ఈ గేమ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ కూడా ఉంటుంది. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందనన్ వర్తమాన్‌, MiG-21 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ గేమ్‌లో చూడొచ్చు. అక్టోబర్ నాటికి మల్టీప్లేయర్ ఫీచర్స్‌తో పూర్తి గేమ్ రిలీజ్ కానుంది. 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఏ కట్ ఎబోవ్' గేమ్‌తో భారత వైమానిక దళంపై యువతలో అభిమానం పెరుగుతుందని భావిస్తున్నారు గేమ్ డెవలపర్స్. ఇక ఈ గేమ్ ఎలా ఆడాలో డెవలపర్లు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


    ఇవి కూడా చదవండి:

    WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?

    Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త... మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తున్న యాప్

    Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి
    First published: