హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Facebook Fuel for India: ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం చేరుతుంది: ముఖేష్ అంబానీ

Facebook Fuel for India: ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం చేరుతుంది: ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

Facebook Fuel for India | ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ప్రపంచంలోని డిజిటల్ కనెక్టివిటీగా ఆర్కిటెక్ట్‌గా కొనియాడిన ముఖేష్ అంబానీ, కోవిడ్ తదనంతర ప్రపంచంలో టెక్నాలజీ పాత్ర ఎలా ఉండొచ్చని జుకర్‌బర్గ్‌‌ను ప్రశ్నించారు .

  ఫేస్‌బుక్ ఫ్యూయెల్ ఫర్ ఇండియా 2020 ఈవెంట్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య సంభాషణ హైలైట్‌గా నిలిచింది. టెలికాం దిగ్గజం అయిన ముఖేష్ అంబానీ, ఐటీ దిగ్గజం అయిన జుకర్‌బర్గ్... భారతదేశంలో డిజిటల్ విప్లవానికి కావాల్సిన తమ విజన్‌ను పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ విజన్‌ను కొనియాడారు. భారతదేశం ఇప్పటివరకు సాధించిన డిజిటల్ విజయాల ఘనత ప్రధాని మోదీదే అన్నారు. ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం కూడా ఒకటిగా మారుతుందని ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అందించినందుకు జుకర్‌బర్గ్‌కు కృతజ్ఞతలు తెలిపారు ముఖేష్ అంబానీ. భారతదేశంలో అనేకమంది ఆంట్రప్రెన్యూర్లకు జుకర్‌బర్గ్ ఆదర్శంగా నిలిచారని, ఇండియాలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యువత పాత్ర ఉందన్నారు.

  భారతదేశంలో ఫేస్‌బుక్-జియో భాగస్వామ్యం ప్రాముఖ్యత ఉంది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో భారతదేశవ్యాప్తంగా 99.99 శాతం జియో నెట్వర్క్ లభించింది. నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమయ్యేందుకు జియో తోడ్పడింది. ముంబైలో కోవిడ్ 19 పేషెంట్ల కోసం ప్రత్యేక ఆస్పత్రిని రిలయెన్స్ ఏర్పాటు చేసింది. కోవిడ్ 19 టెస్టింగ్ ప్రాసెస్‌లో రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ కృషి ఉంది. రోజూ 100,000 పీపీఈ కిట్స్ తయారు చేసి భారతదేశానికి అందించింది రిలయెన్స్. ఇక కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కాలంలో రిలయెన్స్ ఫౌండేషన్ 5.5 కోట్ల మందికి భోజనాన్ని అందించింది. డిసెంబర్ నాటికి 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత భోజనం అందించాం. 20 కోట్ల భారతీయులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1,500 పొందారు.

  ముఖేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

  ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ప్రపంచంలోని డిజిటల్ కనెక్టివిటీగా ఆర్కిటెక్ట్‌గా కొనియాడిన ముఖేష్ అంబానీ, కోవిడ్ తదనంతర ప్రపంచంలో టెక్నాలజీ పాత్ర ఎలా ఉండొచ్చని జుకర్‌బర్గ్‌‌ను ప్రశ్నించారు . జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ఫేస్‌బుక్ అనేక కొత్త ఫీచర్స్‌ని మొదట భారతదేశంలోనే పరీక్షిస్తోందని, ఆ తర్వాతే ప్రపంచానికి పరిచయం చేస్తోందని అన్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టూర్ క్రికెట్ స్ట్రీమింగ్‌ను ఉదహరించారు. డిజిటల్ ఇండియా విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను గుర్తు చేశారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరాబాయి అంబానీ కాలం నుంచి జియో విప్లవం వరకు అనేక అంశాలపై జుకర్‌బర్గ్ మాట్లాడారు. ఉచితంగా వాయిస్ కమ్యూనికేషన్ విజన్ సంకల్పం ధీరుబాయి అంబానీదేనని ముఖేష్ అంబానీ గుర్తు చేశారు.

  ఫేస్‌బుక్ ఫ్యూయెల్ ఫర్ ఇండియా ఈవెంట్ డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనుంది. రెండు రోజుల వర్చువల్ ఈవెంట్ ఇది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Facebook, Jio, Mukesh Ambani, Reliance Jio

  ఉత్తమ కథలు