హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

NordVPN Report: షాకింగ్.. సైబర్ క్రైమ్ మార్కెట్‌లలో ఇండియన్‌ యూజర్ల డేటానే టాప్‌..

NordVPN Report: షాకింగ్.. సైబర్ క్రైమ్ మార్కెట్‌లలో ఇండియన్‌ యూజర్ల డేటానే టాప్‌..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NordVPN Report: బాట్‌ మార్కెట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడ ఇంటర్నెట్‌ యూజర్ల పర్సనల్‌ డేటా విక్రయిస్తారు. అవును స్కామర్లు మాల్‌వేర్‌ల ద్వారా సేకరించిన వివరాలను సేల్‌ చేస్తున్నారు. అలాంటి మార్కెట్‌ ప్లేస్‌లలో ఇండియన్‌ యూజర్ల డేటా ఎక్కువగా ఉందట.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

NordVPN Report:  బాట్‌ మార్కెట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడ ఇంటర్నెట్‌ యూజర్ల పర్సనల్‌ డేటా ( Users Personal data)విక్రయిస్తారు. అవును స్కామర్లు మాల్‌వేర్‌ల ద్వారా సేకరించిన వివరాలను సేల్‌ చేస్తున్నారు. అలాంటి మార్కెట్‌ ప్లేస్‌లలో ఇండియన్‌ యూజర్ల డేటా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. సైబర్ క్రైమ్ మార్కెట్‌ ప్లేస్‌లలో కనుగొనే మొత్తం యూనిక్ యూజర్ డేటాలో కనీసం 12 శాతం ఇండియన్స్‌వి ఉంటున్నాయని గురువారం పనామాకు చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN) సర్వీస్ ప్రొవైడర్ NordVPN ఒక నివేదికలో తెలిపింది. ఈ డేటాలో యూజర్‌లను పర్సనల్‌గా ఐడెటింఫై చేయగలిగే.. పాస్‌వర్డ్‌లు, ఫైనాన్షియల్‌ డేటా, డివైజ్‌లో స్టోర్‌ అయిన కుకీలు ఉంటాయని పేర్కొంది. ఇలాంటి సమాచారాన్ని బాట్‌ మార్కెట్‌ప్లేస్(Bot Market Place)గా పిలిచే ప్రాంతాల నుంచి రూ.500 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని వివరించింది.

టాప్‌లో ఇండియన్‌ యూజర్‌ల డేటా

'బాట్‌' మార్కెట్ అనేది సైబర్ క్రైమ్ మార్కెట్ ‌ప్లేస్‌లను సూచిస్తుంది. ఇది సంబంధిత యూజర్‌ డివైజ్‌లో మాల్వేర్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు యూజర్‌ డేటాను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తుంది. NordVPN ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ల ప్రత్యేక యూజర్‌లకు చెందిన డేటాను ట్రాక్ చేయగా.. డేటా చార్ట్‌లో ఇండియన్‌ యూజర్‌ల స్థానం టాప్‌లో ఉంది. పాపులర్‌ బాట్ మార్కెట్ డేటాబేస్‌లలో 6 లక్షల మంది యూజర్‌ల డేటా కనిపించడం గమనార్హం.

బాట్‌ యాక్టివ్‌గా ఉన్నంత వరకు డేటా అప్‌డేట్‌

ఓల్డ్‌ డేటాను కాకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా అప్‌డేట్‌ చేస్తున్న యూజర్‌ల డేటానే నివేదిక కవర్ చేసింది. ఓల్డ్‌ డేటా సాధారణం.. దీనిపై మార్కెట్‌లో ఎక్కువ ఆసక్తి చూపరు, తక్కువ ధర పలుకుతుంది. ఎందుకంటే ఓల్డ్‌ డేటా ఎఫెక్టివ్‌గా ఉండదు, భవిష్యత్తులో ఏవైనా సైబర్‌ దాడులు చేసేందుకు ఉపయోగపడదు. ఉదాహరణకు డిసెంబర్ 2న, స్వదేశీ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ నివేదిక.. తమిళనాడులోని ఒక ఆసుపత్రి నుంచి విక్రయిస్తున్న 1.5 లక్షల మంది వినియోగదారుల పర్సనల్‌, హెల్త్‌ వివరాలను బయటపెట్టింది. డేటాబేస్ నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న డేటాను ప్రముఖ డేటా మార్కెట్‌ప్లేస్‌లో సుమారు రూ.8,000కి విక్రయించారు. ఇటువంటి ఓల్డ్‌ డేటాబేస్‌లకు పెద్దగా విలువ ఉండదని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.

సమాచారం ద్వారా సైబర్‌ దాడులు

NordVPN ద్వారా స్కాన్ చేసిన డేటాబేస్‌లలో.. గూగుల్ , మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ల లాగిన్ సమాచారం, కుక్కీలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌, ఆటోఫిల్ అడ్రెస్‌లు ఉన్నాయి. కుకీస్‌ను దొంగిలించడం ద్వారా యూజర్‌కు సంబంధించిన యునిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఉండే కోడ్ బిట్స్ లభిస్తాయి. వీటిని ఉపయోగించి హ్యాకర్లు డివైజ్‌లోని టూ- ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను సులువుగా బైపాస్‌ చేయగలరు. డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌లో నెట్‌వర్క్, డివైజ్‌ డేటా వంటి వివరాలు ఉంటాయి. స్కామర్లు వీటిని ఐడెంటిటీ థెఫ్ట్‌ కోసం వినియోగిస్తారు. ఆటోఫిల్ డేటాను కూడా ఐడెంటిటీ థెఫ్ట్‌లో ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటిలో సేవ్ చేసిన అడ్రెస్‌లు, ఫోన్ నంబర్‌లు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి వివరాలు ఉంటాయి.

స్కామర్‌లకు ఈజీ మనీ

ఇటువంటి డేటాబేస్‌లు స్కామర్లకు మంచి రాబడిని ఇస్తాయని NordVPN చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ అన్నారు. బాట్ విక్రయించిన తర్వాత.. సంబంధిత డివైజ్‌లో బాట్ యాక్టివ్‌గా ఉన్నంత కాలం డేటాను అప్‌డేట్‌ చేస్తామని హామీ కూడా ఇస్తారని చెప్పారు. అటువంటి డేటాబేస్‌లను ఒక్కో సర్వీస్ మోడల్‌గా కూడా విక్రయిస్తున్నారని బ్రీడిస్ తెలిపారు. స్ట్రీమ్ అకౌంట్స్‌ను స్కామర్‌లు ఎక్కువకు సేల్‌ చేస్తారని, ఒక్కో అకౌంట్‌ఖాతాకు 6,000 డాలర్లు అందుతాయని వివరించారు.

First published:

Tags: Cyber Attack, Technology

ఉత్తమ కథలు