Home /News /technology /

INDIA TO GET HOME GROWN AUTOMOBILE SAFETY RATING IN BHARAT NCAP SYSTEM UMG GH 2

Apple Offers: ప్రీమియం ప్రొడక్ట్స్‌పై యాపిల్ బంపర్ ఆఫర్లు.. అవన్నీ అతి తక్కువ ధరకే..!

యాపిల్ బంరాఫర్.. తక్కువ ధరకే ప్రొడక్ట్స్ (Credit: Apple)

యాపిల్ బంరాఫర్.. తక్కువ ధరకే ప్రొడక్ట్స్ (Credit: Apple)

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తమ ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను ప్రకటించింది. స్టూడెంట్స్ (Students) కోసం ప్రత్యేకంగా యాన్యువల్ 'బ్యాక్ టూ స్కూల్' ఆఫర్‌ను ప్రారంభించింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్‌ యాపిల్ స్టోర్ నుంచి ఆఫర్‌లో తక్కువ ధరకే వివిధ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు.

ఇంకా చదవండి ...
టెక్ దిగ్గజం Apple తమ ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను ప్రకటించింది. Students కోసం ప్రత్యేకంగా యాన్యువల్ 'బ్యాక్ టూ స్కూల్' ఆఫర్‌ను ప్రారంభించింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్‌ Apple Store నుంచి ఆఫర్‌లో తక్కువ ధరకే వివిధ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. 'బ్యాక్ టూ స్కూల్' పేరుతో యాపిల్ ప్రతి సంవత్సరం స్పెషల్ ఆఫర్ సేల్‌ను అందుబాటులో ఉంచుతుంది. కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో పాటు విద్యావేత్తలు ఈ సేల్‌లో తక్కువ ధరకే యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లు 2022 సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటాయి. తాజా సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్న టాప్ రేంజ్ ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.

MacBook Air (M2)
మ్యాక్‌బుక్ ఎయిర్ (M2)పై యాపిల్ రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది. అదనంగా రూ. 14,000 విలువైన AirPods Gen 2ను ఉచితంగా అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్ (M2) ధర రూ. 1,19,900 కాగా, ఆఫర్లో రూ. 1,09,900 నుంచి ధర ప్రారంభమవుతోంది.

MacBook Air (M1)
మ్యాక్‌బుక్ ఎయిర్ (M1) రూ. 10,000 డిస్కౌంట్‌తో రూ. 89,900 వద్ద అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 99,900. ఈ ప్రొడక్ట్ కొనుగోలుపై రూ. 14,000 విలువైన AirPods Gen 2 ఉచితంగా పొందవచ్చు.

MacBook Pro 14 inch
14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో తాజా ఆఫర్‌లో రూ. 1,75,410 నుంచి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,94,900. ఈ డివైజ్ కొనుగోలుపై AirPods Gen 2 ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది.



MacBook Pro 13 inch
13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,19,900 నుంచి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,29,900 కాగా ఆఫర్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ. 14,000 విలువైన AirPods Gen 2ని ఉచితంగా పొందవచ్చు.

iMac
దీనిపై యాపిల్ సుమారు రూ. 12,000 డిస్కౌంట్ అందిస్తోంది. iMac అసలు ధర రూ. 1,19,900 కాగా కొనుగోలుదారులు రూ. 107910కే దీన్ని పొందవచ్చు. దీంతోపాటు రూ. 14,000 విలువైన AirPods Gen 2 ఉచితం.

MacBook Pro 16 inch
16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో డివైజ్‌పై సుమారు రూ. 25,000 డిస్కౌంట్‌ ఉంది. దీని అసలు ధర రూ. 2,39,900 కాగా, ఆఫర్‌లో రూ. 2,15,910కి సొంతం చేసుకోవచ్చు. AirPods Gen 2 ఉచితంగా లభిస్తుంది.

iPad Pro
ఈ డివైజ్‌పై కంపెనీ రూ. 3600 డిస్కౌంట్ అందిస్తోంది. Apple iPad Pro అసలు ధర రూ. 71,900. కానీ ఆఫర్‌లో రూ. 68300 వద్ద అందుబాటులో ఉంది. కస్టమర్లు AirPods Gen 2ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు.

iPad Air
ఐప్యాడ్ ఎయిర్‌పై రూ. 4,000 డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 54,900. కానీ ఆఫర్‌లో ధర రూ. 50,780కు తగ్గింది. కస్టమర్లు ఉచితంగా AirPods Gen 2 పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Apple store, Iphone, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు