Home /News /technology /

INDIA STARTS TESTING 5G TECHNOLOGY IN GUJARATS AJOL VILLAGE GH VB

5G Trials: ఆ ప్రదేశంలో 5G ట్రయల్స్ ప్రారంభం.. రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కోసం మొదటిసారి టెస్టింగ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5G నెట్‌వర్క్ విషయంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. గుజరాత్‌లోని అజోల్ గ్రామంలో (Ajol village) ఈ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వివరాలిలా..

5G నెట్‌వర్క్ విషయంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. గుజరాత్‌లోని అజోల్ గ్రామంలో (Ajol village) ఈ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో, గాంధీనగర్‌లోని ఉనావా పట్టణంలో బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (BTS) ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్పీడ్‌ను అధికారులు లెక్కించారు. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు, రెండు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీతో కూడిన బృందం అజోల్ గ్రామానికి చేరుకుంది. ఈ టీమ్‌లో DDGలు రోషమ్ లాల్ మీనా, అజాతశత్రు సోమాని, డైరెక్టర్లు వికాస్ దాధిక్, సుమిత్ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. వారితో పాటు నోకియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) టెక్నికల్ టీమ్స్ కూడా ఉన్నాయి.

Christmas Traditions: క్రిస్మస్ రోజు ఫాలో అవ్వాల్సిన మోస్ట్ రొమాంటిక్ ట్రెడిషన్స్.. వీటిపై ఓ లుక్కేయండి..


5G ట్రయల్స్ సందర్భంగా పీక్ డౌన్‌లోడ్ స్పీడ్‌ 105.47Mbps, పీక్ అప్‌లోడ్ స్పీడ్‌ 58.77Mbpsగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ట్రయల్స్ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. “5G BTS ఉన్న ఉనావా పట్టణానికి 17.1 కి.మీ దూరంలో ఉన్న అజోల్ గ్రామంలో 105 Mbps కంటే ఎక్కువ పీక్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను గమనించాం. ఇది రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ కోసం భారత్‌లో టెస్ట్ చేసిన మొట్టమొదటి 5G ఇన్నొవేషన్ సొల్యూషన్” అని ట్వీట్‌లో పేర్కొంది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్‌లతో కూడిన 5G ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్డ్ 360 డిగ్రీస్ కెమెరాలు, VR కనెక్టెడ్ క్లాస్ రూమ్స్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ (VR) కంటెంట్ ప్లేబ్యాక్.. వంటి వాటిని ట్రయల్ సైట్‌లో టెస్ట్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.



భారతదేశంలో 5G ట్రయల్స్
ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. టెలికాం శాఖకు చెందిన అధికారుల బృందం, గాంధీనగర్‌లోని మహాత్మా మండి 5G సైట్ పరిధిలో 5G స్పీడ్‌ను దాదాపు 1.5Gbpsగా రికార్డ్ చేసింది. దీంతోపాటు భారతదేశంలోని అన్ని ప్రధాన టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు కూడా 5G నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ను ప్రారంభించాయి.

ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ముంబైలో చేపట్టిన 5G ట్రయల్స్ సమయంలో రిలయన్స్ జియో 1Gbps స్పీడ్‌ను సాధించిందని చెప్పారు. ఎయిర్‌టెల్ సైతం ముంబైలోని లోయర్ పరేల్ ఏరియాలో 5G ట్రయల్స్ నిర్వహించగా, 1.2Gbps టాప్ డౌన్‌లోడ్ స్పీడ్‌ని సాధించింది. ఢిల్లీలోని సైబర్ హబ్ ప్రాంతంలో నిర్వహించిన స్పెషల్ 5G ట్రయల్‌లో ఈ కంపెనీ 1Gbps కంటే ఎక్కువ డౌన్‌లోడ్ స్పీడ్‌ని అధిగమించగలిగింది. అయితే తాజాగా గుజరాత్‌లో రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కోసం నెట్‌వర్క్‌ను అధికారులు టెస్ట్ చేశారు.
Published by:Veera Babu
First published:

Tags: 5G, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు